హోమ్ /వార్తలు /national /

చిన్నల్లుడి కోసం రంగంలోకి దిగిన బాలకృష్ణ... హోరాహోరీ పోరు

చిన్నల్లుడి కోసం రంగంలోకి దిగిన బాలకృష్ణ... హోరాహోరీ పోరు

నందమూరి బాలకృష్ణ (Balakirshna)

నందమూరి బాలకృష్ణ (Balakirshna)

విశాఖలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తన చిన్నల్లుడు శ్రీభరత్‌కు పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న బాలకృష్ణ... చాలా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

  సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడి గెలుపు కోసం రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా తన సొంత నియోజకవర్గమైన హిందూపురానికి మాత్రమే పరిమితమైన బాలకృష్ణ... ఎన్నికల ప్రచారం గడువు దగ్గరపడుతున్న సమయంలో విశాఖకు వచ్చారు. విశాఖలోని భీమలి సహా పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన బాలకృష్ణ... ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు తన అల్లుడు శ్రీభరత్‌ను గెలిపించాలని కోరారు. విశాఖలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తన చిన్నల్లుడు శ్రీభరత్‌కు పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న బాలకృష్ణ... చాలా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

  నిజానికి హిందూపుంలో ఈ సారి బాలయ్య వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ఆయన భార్య వసుంధర కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీభరత్ తరపున ప్రచారానికి విశాఖకు రాకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే విశాఖలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్‌కు జనసేన అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు వైసీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భరత్ తరపున కనీసం రెండు రోజులైనా ప్రచారం చేయాలని భావించిన బాలకృష్ణ విశాఖ ప్రచార బరిలో దిగారు. భరత్ గెలుపు కోసం విశాఖలోని తన అభిమానులతోనూ ఆయన సమావేశమయ్యారని తెలుస్తోంది. మొత్తానికి చిన్నల్లుడిని గెలిపించుకోవడానికి విశాఖ వచ్చిన బాలకృష్ణ... భరత్‌ను గెలిపిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Balakrishna, Lok Sabha Election 2019, TDP, Visakhapatnam S01p04

  ఉత్తమ కథలు