హోమ్ /వార్తలు /national /

టాలీవుడ్ వివాదం... సీఎం కేసీఆర్ పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు...

టాలీవుడ్ వివాదం... సీఎం కేసీఆర్ పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు...

కేసీఆర్ బాలయ్య (kcr balakrishna)

కేసీఆర్ బాలయ్య (kcr balakrishna)

ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ తనకు తెలియవని.. హైదరాబాద్‌లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

  ఇటీవల టాలీవుడ్ ప్రముఖులపై సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అనుమతి, టాలీవుడ్ సమస్యలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పలువురు సినీ ప్రముఖులు ఇటీవల చర్చించారు. ఐతే ఆ మీటింగ్‌కు తనను పిలవకపోవడంపై బాలకృష్ణ విమర్శలు గుప్పించడం.. ఆ తర్వాత దానిపై పలువురు కౌంటర్లు విసరడం.. పెద్ద రచ్చ జరగడం చకాచకా జరిగిపోయాయి. ఐతే ఈ వ్యవహారం గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు బాలకృష్ణ.

  సీఎం కేసీఆర్‌ను కలవడానికి వాళ్లంతా వెళ్లినప్పుడు నన్న ఎందుకు పిలవలేదో నాకు తెలియదు. గతంలో నేను రాజకీయ కోణంలో కేసీఆర్‌పై చేసిన విమర్శల కారణంగా నన్ను పిలవకూడదని అనుకుంటే.. ఆ విషయం నాకు చెప్పాల్సింది. కేసీఆర్‌ గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. రాజకీయం వేరు. నామా నాగేశ్వరరావు ఎన్నో తిట్టు తిట్టారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరలేదా. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ ‌గారికి పుత్ర వాత్సల్యం ఉంది. అటువంటిది ఏమీ లేదు. ఆయన అలా అని ఉండరు కూడా. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.
  బాలకృష్ణ

  కాగా, ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ తనకు తెలియవని.. హైదరాబాద్‌లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తననెవ్వరూ పిలవలేదని.. పిలవకపోతే తనకు ఎలా తెలుస్తుందని టాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bala Krishna, CM KCR, Telugu Movie News, Tollywood

  ఉత్తమ కథలు