హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

చంపడం మా ఉద్దేశం కాదు..: బాలాకోట్ దాడిపై కేంద్రమంత్రి

చంపడం మా ఉద్దేశం కాదు..: బాలాకోట్ దాడిపై కేంద్రమంత్రి

కేంద్రమంత్రి అహుల్‌వాల్యా(File)

కేంద్రమంత్రి అహుల్‌వాల్యా(File)

Union Minister SS Ahluwalia on Indian Air Force strike : పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ విధ్వంసం చేయగల సత్తా భారత్‌కు ఉందని చెప్పేందుకే దాడులు జరిపామని అహుల్‌వాల్యా అన్నారు. మీడియాలో వచ్చే కథనాలకు తానేం చెబుతానని, తాను ప్రభుత్వ స్టేట్‌మెంట్‌కే కట్టుబడి ఉంటానని చెప్పారు.

ఇంకా చదవండి ...

  పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడి ద్వారా ఆ దేశానికి ఒక హెచ్చరిక పంపించామని.. అంతే తప్ప ప్రాణ నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని కేంద్రమంత్రి అహుల్‌వాల్యా స్పష్టం చేశారు. పాక్‌ ఉగ్ర శిబిరంపై భారత్ దాడిలో ఎంతమంది చనిపోయారన్నది ప్రధాని మోదీ గానీ ప్రభుత్వం గానీ ఎటువంటి లెక్క చెప్పలేదని.. కానీ మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల లెక్కలు ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు. బాలాకోట్ ఉగ్ర శిబిరంపై దాడిలో ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేని తరుణంలో.. ప్రాణ నష్టం కలిగించడం తమ ఉద్దేశం కాదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

  బాలాకోట్ దాడి పాకిస్తాన్‌కు ఒక హెచ్చరిక లాంటిది. శత్రు దేశం లోపల ఎంతదాకైనా చొచ్చుకెళ్లి దాడులు చేయగల సత్తా భారత్‌కు ఉందనిచెప్పడమే దాడి ముఖ్య ఉద్దేశం. దాడి తర్వాత పాల్గొన్న ర్యాలీలోనూ బాలాకోట్‌లో ఎంతమంది చనిపోయారో మోదీ చెప్పలేదు. కానీ భారతీయ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో మాత్రం ఎంతమంది చనిపోయారో లెక్కలు చెబుతున్నారు. నేనొక్కటే అడగదలుచుకున్నా.. ప్రధాని మోదీ గానీ ప్రభుత్వం గానీ లేదా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గానీ దానిపై మీకేమైనా చెప్పారా..?
  కేంద్రమంత్రి అహుల్‌వాల్యా

  పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ విధ్వంసం చేయగల సత్తా భారత్‌కు ఉందని చెప్పేందుకే దాడులు జరిపామని అహుల్‌వాల్యా అన్నారు. మీడియాలో వచ్చే కథనాలకు తానేం చెబుతానని, తాను ప్రభుత్వ స్టేట్‌మెంట్‌కే కట్టుబడి ఉంటానని చెప్పారు. అహుల్‌వాల్యా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సీపీఎం తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: CRPF, Imran khan, Jammu and Kashmir, Narendra modi, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు