అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ ఇవాల్టితో ముగిసింది. అయోధ్య కేసులో చివరిరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా సాగాయి. అయితే తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. నవంబర్ 17లోగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. అయితే డెడ్ లైన్‌కు ఓ గంట ముందే కోర్టు వాదనలు ముగించింది. వరుసగా 40 రోజుల పాటు వాదనలు విన్నది న్యాయస్థానం. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోప వాదనలను బుధవారంతో ముగిస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు ఆయన తెలిపారు.
నవంబర్ 17వ తేదీన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ కేసును కొత్త ధర్మాసనం ముందు తిరిగి మొదటి నుంచి వివరించాల్సి వస్తుంది. గత 39 రోజులుగా సాగుతున్న అయోధ్య కేసును మొదట్లో అక్టోబర్ 18 నాటికి ముగించాలని ధర్మాసనం భావించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 17కు జరిపారు. ఇక ఈ వివాదం పై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతూ వస్తున్న విషయం తెలిసిందే.
అయోధ్య రామమందిర నిర్మానం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Babri masjid, Babri Masjid-Ram Janmabhoomi