హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం..92మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా!

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం..92మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా!

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

తదుపరి సీఎం పేరు ప్రకటన కోసం సమావేశమవబోయే కీలకమైన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు ఇవాళ 16 మంది మంత్రులతో సహా గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం జైపూర్ లోని ఎమ్మెల్యే శాంతి ధరివాల్ ఇంటిలో సమావేశమయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Rajasthan Politics : రాజస్తాన్(Rajasthan) లో రాజకీయ పరిణామాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM)అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)ప్రకటించిన విషయం తెలిసిందే. తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్తాన్ సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజస్తాన్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ కొన్ని నెలల క్రితం ఉదయ్​పుర్ డిక్లరేషన్​లో ఒక వ్యక్తి- ఒకే పదవి((One man-One post)లో ఉండాలని తీర్మానించింది. గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందితే తన ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గెహ్లట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజస్తాన్ సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదు. అశోక్ గెహ్లాట్ సీఎం పదవి నుంచి వైదొలగితే సచిన్ పైలట్(Sachin Pilot) రాజస్తాన్ సీఎం అవడానికి మార్గం సుగమం అవుతుందని నిన్నటివరకు అందరూ భావించారు. అయితే పైలట్ సీఎం అవడం అంత ఈజీగా ఉండదని ఈ రోజు రాజస్తాన్ లో జరిగిన పరిణామాలు సృష్టం చేస్తున్నాయి.

2020లో సచిన్ పైలట్..తన వర్గంగా ముద్రపడిన 18 మంది ఎమ్మెల్యేలతో సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సమయంలో రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 102 మంది ఎమ్మెల్యేలలో ఒకరిని ముఖ్యమంత్రి చేయాలని అశోక్ గెహ్లాట్ టీమ్‌కు చెందిన 56 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారని సమాచారం. తదుపరి సీఎం పేరు ప్రకటన కోసం సమావేశమవబోయే కీలకమైన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు ఇవాళ 16 మంది మంత్రులతో సహా గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం జైపూర్ లోని ఎమ్మెల్యే శాంతి ధరివాల్ ఇంటిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన స్వతంత్ర ఎమ్మెల్యే సన్యామ్ లోధా మీడియాతో మాట్లాడుతూ..."ఎమ్మెల్యేల కోరిక మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోకపోతే, ప్రభుత్వం ఎలా నడుస్తుంది? ప్రభుత్వం పడిపోతుంది" అని అన్నారు.

మరోవైపు,గెహ్లాట్ ని సీఎంని కొనసాగించాలని,సచిన్ పైలట్ కు సీఎం పదవి ఇస్తే  రాజీనామా చేస్తామని 92మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుహైకమాండ్ ని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. 92మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషిని కొద్ది సేపటి క్రితం కలిశారు. గెహ్లాట్ ని సీఎంగా కొనసాగించాలన్న డిమాండ్ తో వీరందరూ స్పీకర్ కి తమ రాజీనామా లేఖలను సమర్పించనున్నట్లు సమాచారం.

Nitish Kumar : నో థర్డ్ ఫ్రంట్.. బీజేపీని ఓడించేది కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ మాత్రమేనన్న నితీష్

200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 100 మంది ఎమ్మెల్యేలు, అలాగే మాయావతి బహుజన సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు 101మంది ఎమ్మెల్యేల మద్దుతు అవసరం. అయితే కాంగ్రెస్ స్థిరత్వాన్ని కొనసాగించడానికి స్వతంత్రుల మద్దతు అవసరం. రాజస్తాన్ లోని 13మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలలో 12మంది ఇప్పటివరకు గెహ్లాట్ కు మద్దతుగా ఉన్నారు.

2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత యువనాయకుడు సచిన్ పైలట్ ని సీఎం పదవి వరిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే అధిష్ఠానం అనూహ్యంగా సీఎం సీటులో గెహ్లాట్ ని కూర్చోబెట్టి,పైలట్ కు డిప్యూటీ సీఎం సీటులో కూర్చోబెట్టింది. అయితే అప్పటి నుంచి సచిన్ పైలట్ అసంతృప్తిగానే ఉన్నారు. 2020లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన కొద్దిరోజులకే అప్పటి రాజస్తాన్ డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్.. ఢిల్లీ శివార్లలోని ఓ హోటల్ లో  తన మద్దుతుదారులైన ఎమ్మెల్యేలతో కొన్ని రోజులు క్యాంప్ నిర్వహించడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైలట్ తన వర్గంతో కలిపి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయని అప్పట్లో ప్రచారం జరిగినా చివరకు రాహుల్,ప్రియాంకగాంధీ జోక్యంతో అలా జరగలేదు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ashok Gehlet, Ashok gehlot, Congress, Congress President Elections, Rajastan, Sachin Pilot

ఉత్తమ కథలు