హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా... రాహుల్ గాంధీ ప్లేస్‌లో అశోక్ గెహ్లాత్ ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా... రాహుల్ గాంధీ ప్లేస్‌లో అశోక్ గెహ్లాత్ ?

రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాత్

రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాత్

గెహ్లాత్ కు అధ్యక్ష పదవి ఖరారయిందని ఓ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా జరిగిన లోక్ ‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆయన పార్టీకి, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీగా అధ్యక్షులుగా నియమిస్తారని అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ, అహ్మద్‌ పటేల్, ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌ ల బృందం కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాడి గెహ్లాత్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాత్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కాంగ్రెస్ తోనూ మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనైతే ఈ పదవికి సరైన వ్యక్తని వారు భావించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో కుటుంబ పాలన నడుస్తోందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పవచ్చని కూడా వారు యోచిస్తున్నట్టు సమాచారం. గెహ్లాత్ కు అధ్యక్ష పదవి ఖరారయిందని ఓ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్​ అధ్యక్ష పదవిలో తాను ఉండలేనని రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సమర్పించారు. అయితే దీన్ని కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. రాహుల్​ నాయకత్వం పార్టీకి అవసరమని, ఆయనే పార్టీ చీఫ్​గా కొనసాగుతారని తేల్చిచెప్పింది. అయినా రాహుల్ మాత్రం తన రూట్ మార్చుకోలేదు. తన ఇక అధ్యక్షుడిగా కొనసాగలేనని పట్టుబట్టి కూర్చున్నారు. పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారాల్ని ఆయన అసలు పట్టించుకోవడం లేదు. మొండిగా ముందుకు వెళ్తున్నారు రాహుల్. దీంతో వేరే దారిలేక ...కాంగ్రెస్ పార్టీ సీనియర్లు... మరో అధ్యక్షుడిని వెతికే పనిలో పడ్డారు.ఈ క్రమంలోనే.. అశోక్ గెహ్లాత్ పేరు తాజాగా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Ashok Gehlet, Congress, Rahul Gandhi, Rajasthan, Sonia Gandhi

ఉత్తమ కథలు