హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sachin Pilot : రాజస్తాన్ లో కీలక పరిణామం..సచిన్ పైలట్ కు సీఎం పదవి!

Sachin Pilot : రాజస్తాన్ లో కీలక పరిణామం..సచిన్ పైలట్ కు సీఎం పదవి!

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

Sachin Pilot To Become Rajastan CM : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM) అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ప్రకటించారు. . భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీని కేరళలో కలుసుకున్న అనంతరం శుక్రవారం ఈ మేరకు గత కొద్దిరోజులుగా నెలకొన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Sachin Pilot To Become Rajastan CM : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM) అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ప్రకటించారు..భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీని కేరళలో కలుసుకున్న అనంతరం శుక్రవారం ఈ మేరకు గత కొద్దిరోజులుగా నెలకొన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. అక్టోబర్‌ 17వ తేదీన జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో(Congress President Election) గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ పడడం లేదని గెహ్లాట్ వెల్లడించారు. అయితే రాజస్తాన్ సీఎం పదవి వదులుకునేందుకు గెహ్లాట్ ఇష్టపడటం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చ అనవసరమని గహ్లాట్ అన్నారు. తాను సీఎం పదవి వదులుకోవడానికి ఇష్టపడట్లేదని మీడియానే చెబుతోందని..తాను ఎప్పటికప్పుడు మౌనంగానే ఉన్నానని అన్నారు..తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్తాన్ సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజస్తాన్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ కొన్ని నెలల క్రితం ఉదయ్​పుర్ డిక్లరేషన్​లో ఒక వ్యక్తి- ఒకే పదవి((One man-One post)లో ఉండాలని తీర్మానించింది. గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందితే తన ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గెహ్లట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజస్తాన్ సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదు. అశోక్ గెహ్లాట్ సీఎం పదవి నుంచి వైదొలగితే సచిన్ పైలట్ రాజస్తాన్ సీఎం అవడానికి మార్గం సుగమం అవవచ్చు.

రాజస్తాన్ లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాల మధ్య స్పీకర్ సీపీ జోషిని సచిన్ పైలట్ శుక్రవారం కలిశారు.పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో సీపీ జోషిని సచిన్ పైలట్ కలిశారు. మరోవైపుపైలట్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించవచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి, గెహ్లాట్ విశ్వాసపాత్రుడిగా పేరుపొందిన సీపీ జోషిని ముఖ్యమంత్రిగా చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

వాస్తవానికి 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత యువనాయకుడు సచిన్ పైలట్ ని సీఎం పదవి వరిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే అధిష్ఠానం అనూహ్యంగా సీఎం సీటులో గెహ్లాట్ ని కూర్చోబెట్టి,పైలట్ కు డిప్యూటీ సీఎం సీటులో కూర్చోబెట్టింది. అయితే అప్పటి నుంచి సచిన్ పైలట్ అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని నెలల క్రితం తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా కూడా చేశారు పైలట్. ఢిల్లీ శివార్లలోని ఓ హోటల్ లో గతేడాది పైలట్ తన మద్దుతుదారులైన ఎమ్మెల్యేలతో కొన్ని రోజులు క్యాంప్ నిర్వహించడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైలట్ తన వర్గంతో కలిపి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయని అప్పట్లో ప్రచారం జరిగినా చివరకు అలా జరగలేదు. పైలట్ ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. చివరికి త్వరలో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పైలట్ ను సీఎం పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Shrikant Shinde: తండ్రి లేనప్పుడు కొడుకుదే రాజ్యం.. సీఎం సీటులో ఆయన కుమారుడు.. ఫొటోలు వైరల్

మరోవైపు,కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో కేరళకు చెందిన ఎంపీ శశిథరూర్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు. అక్టోబర్‌ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహించి.. రెండు రోజుల తర్వాత అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ashok gehlot, Congress President Elections, Rajasthan, Sachin Pilot

ఉత్తమ కథలు