హోమ్ /వార్తలు /జాతీయం /

ఆర్టికల్ 370 తొలగిస్తే భారత్‌తో తెగదెంపులే...ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 తొలగిస్తే భారత్‌తో తెగదెంపులే...ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) తొలగిస్తే ప్రజలు స్వాతంత్ర్యం వైపు అడుగులు వేస్తారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. బీజేపీ ప్రజల మనస్సులు కలిసేందుకు చర్యలు తీసుకోవాలే తప్ప విడగొట్టే ప్రయత్నాలు చేయకూడదని ఆయన హితవు పలికారు.

ఇంకా చదవండి ...

    ఆర్టికల్ 370ని తొలగిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. అధికార బీజేపీ పార్టీ విడుల చేసిన మేనిఫెస్టోలో ప్రధానంగా ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ)లను వెనక్కు తీసుకుంటామని హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 తొలగిస్తే ప్రజలు స్వాతంత్ర్యం వైపు అడుగులు వేస్తారని అన్నారు. బీజేపీ ప్రజల మనస్సులు కలిసేందుకు చర్యలు తీసుకోవాలే తప్ప విడగొట్టే ప్రయత్నాలు చేయకూడదని ఫరూఖ్ అన్నారు. అలాగే ఆర్టికల్ 35(ఏ) తొలగింపును కూడా ఫరూఖ్ తప్పుపట్టారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల రీత్యా రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ...ఆర్టికల్ 370 తొలగిస్తే.. దాని పరిణామాలు అర్థం చేసుకోలేరని అన్నారు. అంతే కాదు దైవసాక్షిగా చెబుతున్నానని, ఒక వేళ దైవం నిర్ణయం కూడా ఇదే అయితే, మనందరికీ స్వేచ్ఛ లభించవచ్చని అన్నారు. అంతే కాదు ఆర్టికల్ 370 తొలగిస్తే జాతీయ జెండా ఎగరేసే వారు సైతం మిగలరని హెచ్చరించారు. ఆర్టికల్ 35(ఏ) తొలగింపుపై స్పందిస్తూ... ఈ చట్టం ద్వారా స్థానికులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పిస్తుందని అన్నారు. అంతే కాదు ఆర్టికల్ 35(ఏ)ను 1927లోనే కాశ్మీర్ మహారాజు హరిసింగ్ స్థానిక గిరిజన తెగలకు సంబంధించిన డోగ్రాలు కాశ్మీర్  లోయను విడిచి తరలి వెళ్లిపోకుండా, వారి జనాభాను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమని అన్నారు. అయితే వారిని తరిమికొట్టి ఇతరులతో కాశ్మీర్ లోయను నింపుతారా అని ప్రశ్నించారు.

    First published:

    Tags: Farooq Abdullah, Jammu and Kashmir, Jammu And Kashmir Lok Sabha Elections 2019, Jammu S09p06, Lok Sabha Election 2019, Omar Abdullah, Srinagar S09p02

    ఉత్తమ కథలు