హోమ్ /వార్తలు /national /

KCR అంటే అర్థాలే వేరు : నోటిఫికేషన్లతోపాటు నిరుద్యోగులకు మరో బంపర్ ఆఫర్: Jeevan Reddy

KCR అంటే అర్థాలే వేరు : నోటిఫికేషన్లతోపాటు నిరుద్యోగులకు మరో బంపర్ ఆఫర్: Jeevan Reddy

కేసీఆర్ అంటే  (K)కొత్త (C)చరిత్ర (R)రాయడం. అంతేకాదు, (K)కొలువులు (C)చదువులు (R)రిజర్వేషన్లు కూడానట. బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చట.

కేసీఆర్ అంటే (K)కొత్త (C)చరిత్ర (R)రాయడం. అంతేకాదు, (K)కొలువులు (C)చదువులు (R)రిజర్వేషన్లు కూడానట. బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చట.

కేసీఆర్ అంటే (K)కొత్త (C)చరిత్ర (R)రాయడం. అంతేకాదు, (K)కొలువులు (C)చదువులు (R)రిజర్వేషన్లు కూడానట. బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చట.

    తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడిని మరింత పెంచుతూ సీఎం కేసీఆర్ మెగా కొలువుల జాతర ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పోను, కొత్తగా 80,039 ఉద్యోగాలకు దశలవారీగా నోటిఫికేషన్లు వేస్తామని వెల్లడించారు. కేసీఆర్ ప్రకటనపై పెదవి విరిచిన విపక్ష నేతలు.. నిరుద్యోగ భృతి, మొత్తం 2లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్లు చేశారు. అధికార టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఊరూరా పటాకులు పేల్చుతూ సందడి చేశాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకొస్తూ ముఖ్యమంత్రిని పొగిడేస్తున్నారు. అందరిలోకి ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కాస్త వెరైటీ వ్యాఖ్యలు చేశారు. గులాబీ బాస్ పేరు KCRకు సరికొత్త అర్థాలు చెప్పడంతోపాటు, నిరుద్యోగులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారాయన..

    KCR అంటే (K)కల్వకుంట్ల (C)చంద్రశేఖర్ (R)రావు అని అందరికీ తెలిసిందే. అయితే, జీవన్ రెడ్డి అర్థం ప్రకారం మాత్రం కేసీఆర్ అంటే (K)కొత్త (C)చరిత్ర (R)రాయడం. అంతేకాదు, (K)కొలువులు (C)చదువులు (R)రిజర్వేషన్లు కూడానట. మెగా ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని,  బండి సంజయ్ కూడా పటాకులు పేల్చే టైమ్ వచ్చిందని సెటైర్లు వేశారు. ఇంకా..

    Telangana ముందస్తు ఎన్నికలు! CM KCR హ్యాట్రిక్ కొట్టినట్టే.. ఉద్యోగాల ప్రకటన తర్వాత Owaisi వ్యాఖ్యలు


    తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయ్యాయని జీవన్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్ళు కడిగినమని, బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించామని, నీళ్లు నిధులు తీసుకొచ్చి, ఇప్పుడు నియామకాలను కూడా చేపట్టామని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మనబడి‌తో విద్యానందిస్తున్నామన్నారు. ఇవాళ ఒక దుర్దినంగా ప్రతిపక్షాలు భావిస్తున్నారని, వాళ్లకు మాటలు రాకుండా సీఎం కేసీఆర్ చేశారని ఆర్మూరు ఎమ్మెల్యే అన్నారు. కాగా,

    Land Monetisation: ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మకం ఇంకా వేగంగా -NLMCకి కేంద్ర కేబినెట్ ఆమోదం


    నిరుద్యోగులెవరూ బీజేపీ ట్రాప్‌లో పడిపోకుండా, శ్రద్ధగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని జీవన్ రెడ్డి సూచించారు. తన నియోజకవర్గం(ఆర్మూరు)లో నిరుద్యోగులకు ఆయన మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెడతానని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని చక్కగా చదవుకోవాలన్నారు.

    First published:

    Tags: Armur, CM KCR, Jeevan reddy, Job notification, Telangana Assembly, Telangana Budget 2022, Telangana jobs

    ఉత్తమ కథలు