హోమ్ /వార్తలు /national /

Atchannaidu Arrest: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో హై టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే..?

Atchannaidu Arrest: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో హై టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే..?

అచ్చన్నాయుడు (ఫైల్ ఫోటో)

అచ్చన్నాయుడు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోటబొమ్మాలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాలు.. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఆమెపై పోటీకి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్నను వైసీపీ బరిలో నిలిపింది. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కేవలం వైసీపీ అభ్యర్థిని తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. ఇక, తాను నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని అప్పన్న ఆరోపించారు.

ఇక, ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు వైఎస్సార్ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు టెక్కలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజరాపు అప్పన్న నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు వైసీపీ నాయకులు తెలిపారు.



ఓ వైపు అచ్చెన్న అరెస్ట్.. మరోవైపు విజయసాయిరెడ్డి నిమ్మాడలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కూడా భారీగా భద్రత చర్యలు చేపట్టారు.

అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు..

అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డి కక్ష కట్టారని ఆరోపించారు. అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని విమర్శించారు.

First published:

Tags: Andhra Pradesh, Kinjarapu Atchannaidu, Srikakulam, TDP, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు