తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌లో పూర్తిగా సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పకనే చెప్పారు. సింగపూర్ విమానాలు దిగేందుకు నిధులు విడుదల చేయాలా లేక వేలాది మంది తల్లీబిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేయాలా అనే విషయంలో తాము మొదటి దాన్ని వదిలేయాలని నిర్ణయించినట్టు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లో నవరత్నాల పథకాలపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బుగ్గన వివరించారు. అందుకు తగ్గట్టుగానే కేటాయింపులు ఉంటాయని... అందుకు సంబంధించిన నిధుల కేటాయింపులు ప్రకటించడానికి ముందే తేల్చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన వైసీపీ ప్రభుత్వం... బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి ఎక్కువ కేటాయింపులు జరిపే అవకాశం లేదని వార్తలు వినిపించాయి. తమ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన ప్రజలకు నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమాన్ని అందించడమే ఏపీ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకున్నట్టు బడ్జెట్‌లో వివిధ పథకాలకు జరిపిన కేటాయింపులను బట్టి అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Buggana Rajendranath reddy, Navaratnalu