Home /News /national /

POLITICS AP MINISTER NARA LOKESH SATIRICAL COMMENTS ON JAGAN IN TWITTER PS

గులాబీ తోటలో పువ్వే మీరు.. జగన్‌పై లోకేశ్ కవితాత్మక సెటైర్లు

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

ap assembly elections 2019 | జగన్ మీద సెటైరికల్ పద్యాన్ని విసిరారు మంత్రి నారా లోకేశ్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడిలోని గులాబీ తోట పువ్వని విమర్శించారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా.. ఇంకా ఎందుకు రంగులు మారుస్తున్నారని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...
    ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థులను విమర్శించేందుకే ఏ ఒక్క సందర్భాన్నీ వదులుకోవట్లేదు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్‌తో కలిసి ఏపీకి ద్రోహం చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ.. సోషల్ మీడియా వేదికగా ప్రతి అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేశ్.. ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీలపై తనదైన స్టైల్లో విరుచుకు పడ్డారు. జగన్‌ను విమర్శించే క్రమంలో కొత్త పద్యాన్ని కనిపెట్టారాయన. వేమన శతక పద్యానికి పేరడీ కట్టి.. టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీల మైత్రిని విమర్శించారు.

    ఏపీలో వైఎస్ఆర్‌సీపీకి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సాయం చేస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు సంబంధించి ఏ ఒక్క అంశం బయటపడినా వదలడం లేదు. తాజాగా, ఏపీలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన వాహనాల్లో.. సీట్లకు పింక్ కలర్ కవర్లు ఉండడం, వాటిపై కారు బొమ్మలు ముద్రించి ఉండడం.. సంచలనం రేపింది. టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీల మధ్య దోస్తీకి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటోలను పోస్టు చేసింది టీడీపీ. ఇవే ఫొటోలను తాజాగా ట్విట్టర్‌లో పోస్టు చేసిన నారా లోకేశ్.. జగన్‌పై స్పెషల్ పద్యం అందుకున్నారు. టీఆర్ఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

    తెలంగాణ దొరగారి కారు.. ఆంధ్రాలో జగన్ షికారు!

    వైకాపా కారు చూడ మేలిమై ఉండు

    సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు

    రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ,

    దొరగారి ప్ర‘గఢీ’భవన్ గులాబీతోటలో పువ్వే మీరు!

    అంటూ జగన్ మీద సెటైరికల్ పద్యాన్ని విసిరారు మంత్రి నారా లోకేశ్.  జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడిలోని గులాబీ తోట పువ్వని విమర్శించారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా.. ఇంకా ఎందుకు రంగులు మారుస్తున్నారని ప్రశ్నించారు.

    Published by:Santhosh Kumar Pyata
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Nara Lokesh, Trs, Ys jagan, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు