హోమ్ /వార్తలు /national /

Nara Lokesh: లోకేశ్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు.. ఆ టీడీపీ నేత గన్‌తో కాల్చుకోవాలన్న ఏపీ మంత్రి

Nara Lokesh: లోకేశ్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు.. ఆ టీడీపీ నేత గన్‌తో కాల్చుకోవాలన్న ఏపీ మంత్రి

కొడాలి నాని, నారా లోకేశ్(ఫైల్ పోటో)

కొడాలి నాని, నారా లోకేశ్(ఫైల్ పోటో)

Kodali Nani: అమరావతిలో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదని కొడాలి నాని అన్నారు. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  టీడీపీ తీరుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేశ్‌కు వరి చేనుకి, చేపల చెరువుకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేశ్ ఓ వేస్ట్ ఫెలో అని విమర్శించారు. లోకేశ్ ఎంత తిరిగినా ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదని కొడాలి నాని అన్నారు. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ..బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు తనను తాను గన్‌తో కాల్చుకోవాలని కొడాలి నాని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎస్కార్ట్ సిబ్బందిపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఇబ్బందులకు దేవినేని ఉమానే కారణమని కొడాలి నాని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో సాగునీటి వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన దేవినేని ఉమా... పోలవరం విషయంలో వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.

  అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని, రూ. 55వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి గతంలో రాజ్యసభలో ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి ప్రశ్న వేశారని, రూ. 55వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారా ? అని అడడగ్గా.. ఒప్పుకున్నట్లు చెప్పిందని అన్నారు. ఇప్పుడు వాళ్ల కేసుల మాఫీ కోసం ఆ నిధులను రూ. 25 వేలకు కుదించారని లోకేశ్ మండిపడ్డారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తెస్తామని చెప్పిన వైసీపీ.. 22 మంది ఎంపీలను ఇస్తే ఏపీకి రూ. 30వేల కోట్ల నష్టం వచ్చేలా చేశారని విమర్శించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Kodali Nani, Nara Lokesh

  ఉత్తమ కథలు