హోమ్ /వార్తలు /national /

Nara Lokesh: నారా లోకేశ్‌కు ఆ రెండూ రావు.. పరమ వేస్ట్ అన్న ఏపీ మంత్రి

Nara Lokesh: నారా లోకేశ్‌కు ఆ రెండూ రావు.. పరమ వేస్ట్ అన్న ఏపీ మంత్రి

కొడాలి నాని, నారా లోకేశ్(ఫైల్ పోటో)

కొడాలి నాని, నారా లోకేశ్(ఫైల్ పోటో)

Nara Lokesh: లోకేష్ కొల్లేటిలో ట్రాక్టర్‌ను ఏ విధంగా దించాడో టీడీపీని కూడా అలాగే దించుతాడని ఏపీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

  టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించే ఏపీ మంత్రి కొడాలి నాని.. మరోసారి ఆ పార్టీ యువనేత లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. ట్రాక్టర్‌ కూడా సరిగ్గా నడపరాని లోకేశ్‌...టీడీపీని కూడా కొల్లేటిలో దించుతాడని సెటైర్లు వేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా.. వరదలు ఎప్పుడో వస్తే..ఇప్పుడు వచ్చి పంటలను పరిశీలిస్తున్నారని విమర్శించారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..? అని కొడాలి నాని కామెంట్ చేశారు. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్ అని ధ్వజమెత్తారు. లోకేశ్‌చు పార్టీ నడపడం రాదని, ట్రాక్టర్ నడపడం కూడా రాదని అన్నారు.

  లోకేష్ కొల్లేటిలో ట్రాక్టర్‌ను ఏ విధంగా దించాడో టీడీపీని కూడా అలాగే దించుతాడని ఎద్దేవా చేశారు. బుద్ధి ఉన్నోళ్లు ట్రాక్టర్ నుంచి దిగిపోయిన విధంగానే టీడీపీ నుంచి దిగిపోవాలని సూచించారు. లోకేష్ గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. నందిగామలో పర్యటించిన మంత్రి కొడాలి నాని.. టీడీపీతో పాటు నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.

  నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురంలో పర్యటించిన నారా లోకేశ్.. అక్కడ ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే లోకేష్ పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ట్రాక్టర్‌ను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో లోకేష్ వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపారంటూ నారా లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Kodali Nani, Nara Lokesh

  ఉత్తమ కథలు