అయ్యప్ప మాల వేసుకొని చెప్పులతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకొంటున్నానని వివరణ ఇచ్చారు. తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తాను హిందూ మతంలోనే పుట్టాను.. హిందూ మతంలోనే చనిపోతాను అని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా.. మాల వేసుకొని చెప్పులతో నడిచానని... ఆ పార్టీ నేత మురళీమోహన్ కూడా మాలలో చెప్పులు వేసుకొంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మతాన్ని రాజకీయానికి వాడుకుంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీలో ఉన్నపుడు మాలలో పవిత్రంగా ఉన్న తాను... వైసీపీలోకి వెళ్లిన తర్వాత అపవిత్రుడినయ్యానా అని ప్రశ్నించారు.ఇంగ్లీషు మీడియం అంశంపై రాద్ధాంతం చేయడం ఆయనకు తగదని హితవు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Avanthi srinivas, Ysrcp