ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చి ధర్మాలు చేయించాల్సిన అవసరం తమకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పులివెందుల నుంచి రౌడీలను రప్పించి తమపై దాడి చేయించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట నుంచి రౌడీలు వచ్చారని నిరూపించకపోతే రాజకీయాల నుంచి చంద్రబాబు తప్పుకుంటారా ? అని సవాల్ విసిరారు. ఒకవేళ చంద్రబాబు తాను అన్నది నిజమని నిరూపిస్తే తాను రాజీనామాకు రెడీ అని సవాల్ విసిరారు.
అమరావతికి మధ్దతు తెలిపితే విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో పోలీసులు, మహిళల పట్ల చంద్రబాబు తీరు దారుణంగా ఉందని మంత్రి అవంతి ఆరోపించారు. -మండుటెండలో ఆరుగంటలపాటు ప్రజలు స్వచ్ఛందంగా ధర్నా చేశారని... ఈ నిరసనలను చంద్రబాబు గమనించాలని అన్నారు. ఇళ్ళకు వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్ అనడం దారుణమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. లోకేష్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు పట్ల ఆగ్రహంగా ఉన్నారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Avanthi srinivas, Chandrababu naidu, Tdp, Visakhapatnam, Ysrcp