ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఆ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం మీద తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రమేష్ కుమార్ చేసింది తప్పో, ఒప్పో, రాజ్యాంగపరంగా కరెక్టో కాదో, సుప్రీంకోర్టే తేలుస్తుందన్నారు. ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్‌కు స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రకారం అధికారాలు ఉంటాయని, అయితే, వాటిని దుర్వినియోగం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అదే సమయంలో రమేష్ కుమార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన నిమ్మగడ్డ రమేష్ కాదు. నారా వారి రమేష్ అని చెప్పుకోవాలి. కరోనా వైరస్ కంటే నిమ్మగడ్డ రమేష్ అత్యంత ప్రమాదకారి. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే ఏం చేస్తుందో, నిమ్మగడ్డ రమేష్ ఈ రోజు అదే పనిచేశారు. హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని సంప్రదించుకుండా, ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాన్నిఎలా ప్రకటిస్తారు? రాజకీయ పార్టీలతో చర్చించకుండానే వాయిదా వేశారు. రమేష్ కులపిచ్చి, ఎల్లో సూసైడ్ స్క్వాడ్‌లో మెంబర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు సిగ్గుంటే, నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి. నిమ్మగడ్డ రమేష్ అనేకంటే నారావారి గబ్బిలం అని పిలిస్తే బాగుంటుంది.’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్రంగా కామెంట్స్ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తానా అంటే కన్నా తందానా అంటున్నారని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగతంగా చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారని, ఇది బీజేపీ మనుగడకు ప్రమాదమని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఆర్టికల్ 243కే, ఆర్టికల్ 243 జెడ్ (ఏ) ప్రకారం తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి రమేష్ కుమార్ చెప్పడాన్ని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Tdp, Vijayasai reddy, Ysrcp