నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీద ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురాకుండా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాతో పంచుకోవడాన్ని జగన్ తప్పుపట్టారు. ఆనం రామనారాయణరెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది.
ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 6న మీడియాతో మాట్లాడుతూ... కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందన్నారు. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు కుమిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే, ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు పరోక్షంగా జిల్లాకు చెందిన మంత్రి అనిల్‌ను ఉద్దేశించి చేసినట్టు కనిపిస్తోంది. జగన్ కేబినెట్‌లో ముఖ్యమైన శాఖను నిర్వహిస్తున్న అనిల్ కుమార్ మీద బెట్టింగ్ కేసులు ఉన్నాయి. పరోక్షంగా అనిల్‌ను ఉద్దేశించి ఆనం రామనారాయణరెడ్డిఈ వ్యఖ్యలు చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి పరోక్షంగా స్పందించారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పబోవని హెచ్చరిించారు. మరోవైపు ఆనం ఎందుకు అలా అన్నారో తనకు తెలియదని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.