హోమ్ /వార్తలు /national /

కొత్తగా వచ్చిన నేతకు జగన్ కీలక పదవి?

కొత్తగా వచ్చిన నేతకు జగన్ కీలక పదవి?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం

కొన్ని రోజుల క్రితం పార్టీలో చేరిన ఓ నేతకు కీలక పదవి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల ముందే పార్టీలో చేరిన ఓ నేతకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, రామరాజుతోపాటు ఆయన సోదరులు కొన్ని రోజుల క్రితం వైసీపీలో చేరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజుకు చెక్ పెట్టేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఉండగా, గంగరాజు కుటుంబం వైసీపీలో ఎందుకు చేరిందని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ప్రముఖ వ్యాపారవేత్త అయిన గంగరాజు కుమారుడికి భవిష్యత్తులో రాజ్యసభ ఇస్తామని వైసీపీకి చెందిన ప్రముఖులు హామీ ఇచ్చి తీసుకొచ్చినట్టు సమాచారం. అప్పటి పరిస్థితుల్లో రఘురామకృష్ణం రాజు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు అదే సామాజికవర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త కూడా అయిన గంగరాజు కుటుంబాన్ని వెంటనే చేర్చుకున్నట్టు తెలిసింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju

    ఉత్తమ కథలు