హోమ్ /వార్తలు /national /

విశాఖకు సీఎం జగన్ భారీ వరాలు..

విశాఖకు సీఎం జగన్ భారీ వరాలు..

సీఎం జగన్

సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించనున్న సీఎం జగన్.. నగరాభివృద్ధికి భారీ వరాలు ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించనున్న సీఎం జగన్.. నగరాభివృద్ధికి భారీ వరాలు ప్రకటించారు. విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(VMRDA) పరిధిలో రోడ్లు, డ్రైనేజీ లు, పార్కుల అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ, వాటి కోసం నిధులు కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా 7 జీవోలను జారీ చేసింది. విశాఖ అభివృద్ధిపై సమీక్షలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, ఈ నెల 28న విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం జగన్.. అక్కడ రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Amaravati, Ap capital, AP News, AP Politics, Chandrababu Naidu, Nara Lokesh, TDP, Vijayasai reddy, Visakhapatnam, Ysrcp

    ఉత్తమ కథలు