హోమ్ /వార్తలు /national /

YS Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. చివరి నిమిషంలో నిర్ణయం.. కారణమిదే..

YS Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. చివరి నిమిషంలో నిర్ణయం.. కారణమిదే..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

YS Jagan Delhi Tour Cancelled: సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 25 మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ నిర్వహించే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత పలు కేంద్ర మంత్రులతోనూ భేటీ కావాలని అనుకున్నారు.కానీ అంతలోనే ఆయన కాలు బెణికడంతో.. టూర్‌ను రద్దు చేసుకున్నారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)  ఢిల్లీ పర్యటన రద్దయింది. శనివారం ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్లాల్సి ఉండగా.. అందుకు కొన్ని గంటల ముందు పర్యటనను రద్దు చేసుకున్నారు.  శుక్రవారం ఉదయం  వ్యాయామం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌ కాలు బెణికింది.  సాయంత్రం వరకు తగ్గితే షెడ్యూల్ ప్రకారం శనివారం ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నారు.  కానీ సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు సీఎం  జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులుగా హోం మంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) ఢిల్లీకి వెళ్తారు. ఆదివారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) నేతృత్వంలో జరిగే సమావేశంలో ఏపీ తరపున హోం మంత్రి సుచరిత పాల్గొంటారు.

సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 25 మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ నిర్వహించే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత పలు కేంద్ర మంత్రులతోనూ భేటీ కావాలని అనుకున్నారు. కానీ అంతలోనే వ్యాయామ సమయంలో కాలు బెణకడంతో..ఆ నొప్పి కారణంగా సీఎం ఢిల్లీ పర్యటన రద్దయింది.

Vijayawada: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో..

మరోవైపు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శనివారం (సెప్టెంబరు 25) కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో స‌మావేశం కానున్నారు. ఆదివారం (సెప్టెంబరు 26) విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రమంత్రి పీయుష్ గోయెల్‌తోనూ సీఎం కేసీఆర్ భేటీ అవుతారు.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని రోజులుగా నీటి పంచాయితీ నెలకొన్న విషయం తెలిసిందే. అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ..తమ నీళ్లను తరలించుకుపోతున్నారంని ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సాగు నీటి కోసం వినియోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జలశక్తిమంత్రిత్వ శాఖతో పాటు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం కానుండడం హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, CM KCR, Ys jagan

ఉత్తమ కథలు