ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాను చెప్పిన సిద్ధాంతాలకు కట్టుబడి జగన్ రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగాంగనే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. త్వరలో పార్టీలోకి రాబోతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ భవిష్యత్తుపై సీఎం జగన్ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎవరైన పార్టీ మారితే తన పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ నిర్ణయంతో వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలో ఆయన సీటు ఇవ్వకుండా రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. వంశీ పోటీ చేసిన గన్నవరం సీటును... ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డకు ఇచ్చేందుకు జగన్ ఒప్పించినట్లుగా కూడా సమాచారం. గత ఎన్నికల్లో వంశీపై స్వల్ప ఆధిక్యంలో ఓడిపోయిన యార్లగడ్డకు గన్నవరంలో మరోసాని పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు జగన్ను నమ్ముకొని వెళ్తే వారికి న్యాయం జరుగుతుందన్న భావనకూడా వారిలో కల్పించిడానికే వంశీకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని తెలుస్తోంది.
వల్లభనేని వంశీ టీడీపీని వీడతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరుతారని కొందరు.... వైసీపీలోకి వెళ్తారని ఇంకొందరు చెబుతున్నా... ఈ క్రమంలో శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో సమావేశమైన వల్లభనేని వంశీ.. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఏపీ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తానికి వంశీ వైసీపీలో జాయిన్ అయిపోతారని ఖరారు అయిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Rajya Sabha, Tdp, Vallabhaneni vamsi, Ysrcp