హోమ్ /వార్తలు /national /

Jagan bail: జగన్ బెయిల్ రద్దు కేసు.. ఇదే చివరి అవకాశమన్న సుప్రీం కోర్టు

Jagan bail: జగన్ బెయిల్ రద్దు కేసు.. ఇదే చివరి అవకాశమన్న సుప్రీం కోర్టు

ప్రధానికి రఘురామ లేఖ

ప్రధానికి రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా..? కొనసాగుతుందా..? త్వరలో ఏం జరగబోతోంది. సుప్రీం కోర్టులో మాత్రం వాడీవేడిగా వాదనలు జరుగుతునే ఉన్నాయి. ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఈ నెల 26 సీఎం జగన్ బెయిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై రోజు రోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. సుప్రీం కోర్టు దీనిపై ఏం చెబుతుందని అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. పిటిషనర్ వాధనతో ఏకిభవించి బెయిల్ రద్దు చేస్తే ఏపీలో పరిస్థితి ఏంటి. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బెయిర్ రద్దు సాధ్యం కాదని కొందరు అంటున్నారు. మరి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అయితే పదే పదే విచారణ వాయిదా పడుతుండడంతో ఈ ఉత్కంఠ ఇంకాస్త పెరుగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు సార్లు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని పిటిషనర్ కోర్టుకి తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు మాత్రం.. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేసింది. విచారణను 26కి వాయిదా వేసింది.

  మరోవైపు జగన్‌పై ఉన్న కేసుల్లో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఏపీలో మంచి హోదాలో పని చేస్తున్నారని వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ సీఎం ప్రభావితం చేసే అవకాశం ఉందని లిఖిత పూర్వక వాదనల్లో పిటిషనర్ తెలిపారు. గతంలో ఐఏఎస్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను ఏపీ సీఎం వేధింపులకు గురిచేశాడని.. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల ట్రాక్ రికార్డ్ చూడాల్సిన బాధ్యత సీఎస్ పరిధిలో ఉంటుందని, కానీ ప్రత్యేక జీవో ద్వారా సీఎం జగన్ ఆ అధికారులను బదిలీ చేసుకున్నారన్నారు. దీంతో సాక్షులుగా ఉన్న అధికారులను పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, ముమ్మాటికి ఏపీ సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లగించారని పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు.

  తాజాగా కోర్టు చెప్పిన దాని ప్రకారం సీబీఐ ఈ సారి తప్పక లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇచ్చామని స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చినా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. కావాలనే సీబీఐ అధికారులు సమాధానం ఇవ్వడం లేదా.. వేరే ఇతర కారాణాలు ఉన్నాయా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కారణం ఏదైనా.. ఇక సీబీఐకు సమాధానం లేదు. ఈ నెల 26వ తేదీని సీబీఐ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సింది.. ఆ సమాధానం బట్టి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై స్పష్టత వస్తుంది..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, MP raghurama krishnam raju, Supreme Court

  ఉత్తమ కథలు