హోమ్ /వార్తలు /national /

రోజాకు మరో బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్

రోజాకు మరో బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్

తనకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లు అని చెప్పింది ఈ భామ. తనకు ప్రొఫెషన్ సినిమా అయితే.. రాజకీయాలు ప్రాణం అంటుంది. తనకు నటిగా ప్రజల గుండెల్లో స్థానం ఇచ్చారని.. దాన్ని కాపాడుకుంటున్నానని చెప్పింది రోజా. అయినా రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మోడ్రన్ డ్రస్సులు వేసుకోకూడదా.. డాన్సులు చేయకూడదా..?

తనకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లు అని చెప్పింది ఈ భామ. తనకు ప్రొఫెషన్ సినిమా అయితే.. రాజకీయాలు ప్రాణం అంటుంది. తనకు నటిగా ప్రజల గుండెల్లో స్థానం ఇచ్చారని.. దాన్ని కాపాడుకుంటున్నానని చెప్పింది రోజా. అయినా రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మోడ్రన్ డ్రస్సులు వేసుకోకూడదా.. డాన్సులు చేయకూడదా..?

Roja Selvamani | ఓ వైపు రాజకీయ కార్యక్రమాలు, మరోవైపు తన టీవీషోలతో బిజీగా ఉన్నా కూడా జగన్ ఇచ్చిన టార్గెట్ రీచ్ కావడానికి రోజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఓ వైపు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా, మరోవైపు ఎమ్మెల్యేగా రాజకీయ విధుల్లో తలమునకలైన రోజా భుజం మీద మరిన్ని అదనపు బాధ్యతలను మోపారు సీఎం జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాన్ని స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో విజయం సాధించారో.. అయా అభ్యర్థులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. వారంతా తమ తమ నియోజకవర్గాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వారి భుజాలపై పెట్టారు.

  గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున నగరి నుంచి పోటీ చేసిన రోజా కేవలం 2వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో రోజా మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. నగరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, ఇతర గ్రామ పంచాయతీల మీద దృష్టిపెట్టాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. జగన్ ఇచ్చిన టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు రోజా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచూ ‘వార్డ్ వాక్’ పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో రోడ్లు, భవనాలకు శంకుస్థాపనలు, భూమిపూజల్లో కూడా విస్తృతంగా పాల్గొంటున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీని బలహీనపరిచే కార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు రోజులకు టీడీపీ నుంచి వైసీపీలోకి కార్యకర్తల వలసలు ఉండేలా చూస్తున్నారు. వారందరికీ రోజానే పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు.

  నగరి మున్సిపాలిటీ చింతలపట్టెడ 25, 26వ వార్డుల్లో ఎమ్మెల్యే రోజా వార్డు వాక్

  వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి ఇప్పటి వరకు తాను నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో ఈ మధ్యే సీఎం జగన్‌ను కలసి వివరించారు. ఈ సందర్భంగా జగన్ ఆమెను ప్రశంసించినట్టు తెలిసింది. అలాగే, కంటిన్యూ చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆదేశించారు. ఓ వైపు రాజకీయ కార్యక్రమాలు, మరోవైపు తన టీవీషోలతో బిజీగా ఉన్నా కూడా జగన్ ఇచ్చిన టార్గెట్ రీచ్ కావడానికి రోజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, MLA Roja, Nagari

  ఉత్తమ కథలు