హోమ్ /వార్తలు /national /

వారేవా జగన్!! మూడు రాజధానుల కొత్త బిల్లులో మహా తెతివి -అంతరాత్మను టేబుల్‌పై పెట్టేసి: somu

వారేవా జగన్!! మూడు రాజధానుల కొత్త బిల్లులో మహా తెతివి -అంతరాత్మను టేబుల్‌పై పెట్టేసి: somu

చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం

చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం

మూడు రాజధానులపై జగన్ సర్కారు తేబోయే కొత్త బిల్లుల్లో మహా తెలివితేటలు చూపించబోతున్నట్లు, గతంలో మాదిరిగా మూడు రాజధానుల చట్టాలను కోర్టులు కొట్టేయలేని విధంగా పకడ్బందీ నిబంధనలతో తయారవుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీలో వరదలకు అసలు కారణాలు కూడా చెప్పారాయన..

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వివాదాన్ని మరింత పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) వ్యూహాత్మక అడుగు వేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై గతంలో తెచ్చిన బిల్లుల్ని రద్దు చేస్తూ అసెంబ్లీ (AP Assembly) లో తీర్మానాలు కూడా చేయించిన ఆయన.. అతి త్వరలోనే సమగ్ర విధానంతో, పరిపూర్ణమైన కొత్త బిల్లుల్ని తెస్తామని చెప్పారు. సీఎం జగన్ ఆ ప్రకటన చేసినప్పటి నుంచి.. రాబోయే కొత్త బిల్లులు ఎలా ఉంటానే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ చర్చను మరో మలుపు తిప్పుతూ మూడు రాజధానుల కొత్త బిల్లులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు సీఎం జగన్, వైసీపీని విమర్శిస్తూనే వారు అనుసరించబోయే వ్యూహాలను సోము ముందుగానే పసిగట్టేశానంటూ కొన్ని హింట్స్ ఇచ్చారు. అంతేకాదు, ఏపీని వదరలు ముంచెత్తడానికి గల కారణాలను కూడా చెప్పారాయన. మూడు రాజధానులు, వరద విలయం, నారా భువనేశ్వరి ఉదంతం తదితర అంశాలపై సోము వీర్రాజు మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం జగన్, వైసీపీ నేతలపై సోము తీవ్ర కామెంట్లు చేశారు..

కొత్త బిల్లుల్లో జగన్ ప్లాన్ ఇదే

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లులను ప్రవేశపెడతామని సీఎం జగన్ చెప్పడం తెలిసిందే. అయితే ఆ ప్రకటన చేస్తున్న సమయంలో జగన్ తన అంతరాత్మను తీసి టేబుల్ మీద పెట్టేసి పచ్చిగా అబద్దాలు మాట్లాడారని, కేవలం అబద్దాలు, బూతులు మాట్లాడటానికే వైసీపీ అసెంబ్లీని వాడుకుంటున్నదని సోము వీర్రాజు మండిపడ్డారు. మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో ఓటమి తప్పదని గ్రహించిన తర్వాతే జగన్ ఆ బిల్లుల్ని వెనక్కి తీసుకున్నారని, త్వరలో తీసుకురాబోయే రాజధాని బిల్లుల్లో.. ఈ అంశాన్ని కోర్టు పరిధుల నుంచి తప్పించాలన్నదే జగన్ వ్యూహమని, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించే పరిస్థితి లేకుండా చేయబోతున్నారని, ఆ మేరకు కొత్త బిల్లులో నిబంధనలు కూర్చబోతున్నారని సోము వీర్రాజు చెప్పారు.

నా భార్యనూ గదిలో అలా ఫొటోలు తీశారు -ఆత్మహత్య ఆగింది కూడా ఇందుకే -భువనేశ్వరి ఉదంతో భారీ కుదుపుసీఎం జగన్ పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్

వికేంద్రీకరణకు డబ్బులు ఎక్కడివి?

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని స్థితిలో జగన్ సర్కారు ఉండగా.. అర్థం లేని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి ఎలా సాధిస్తారో అర్థంకాకుండా ఉందని, అసలు వికేంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. అమరావతి విషయంలో సీఎం జగన్ కు అసలు చిత్తశుద్ది లేదని, అభివృద్దికి, వికేంద్రీకరణకు సంబంధం లేకున్నా జగన్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి, కొత్త రాజధానులను సైతం నిర్మించిందని, ప్రజలకు, ప్రాంతానికి మంచి చేయాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే జగన్ అబద్దాలతో కాలం నెట్టుకొస్తున్నారని విమర్శించారు.

భువనేశ్వరికి అవమానం తర్వాత తొలిసారి -సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు -ప్రత్యేక విమానంలో..ఏపీలో వరదలకు కారణమిదే

రాష్ట్రంలో వరదలు ముంచెత్తి భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతే, అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చి జగన్ చేతులు దులిపేసుకోవడం భావ్యంకాదని సోము అన్నారు. విశాఖపట్నం గ్యాస్ ప్రమాద బాధితులకు రూ.1కోటి పరిహారం ఇచ్చిన జగన్.. వరద వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు కేవలం రూ.5లక్షలే ఇవ్వడం అన్యాయమన్నారు. ఇంత మంది ప్రజలు చనిపోయి, వందల ఊళ్లలో విలయం ఏర్పడితే ఇప్పటిదాకా సీఎం పర్యటించలేదని, ఏరియల్ సర్వే చేస్తే సరిపోదని సోము అన్నారు. వైసీపీ ఇసుక మాఫియా వల్లే ప్రాజెక్టులకు కొట్టుకుపోయి ఊళ్లను వదర ముంచెత్దిందని ఆరోపించారు. మరీ దారుణంగా..

wow: ముతాంజ్ చనిపోయిన ఊరికి ఇప్పుడితనే షాజహాన్ -భార్య కోసం తాజ్ మహల్ కట్టిన ఆనంద్ -viral photos


కోటీశ్వరుడి బిస్కెట్ల పంపకం..

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి.. వరద బాధితులకు బిస్కెట్లు పంపిణీ చేయడాన్ని బీజేపీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ‘వైసీపీ ఎమ్మెల్యే మేడా పెద్ద కాంట్రాక్టర్. ప్రభుత్వం నుంచి భారీ ప్రాజెక్టులు తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి వరద బాధితులకు బిస్కెట్లు పంచుతున్నాడంట ఏం మనస్తత్వం అనుకోవాలి? వీళ్ల ఇసుక దందా కారణంగానే కదా అన్నమయ్య, పించా ప్రాజెక్టులు కొట్టుకుపోయి, తిరుపతిని వరద ముంచెత్తింతి? ప్రాజెక్టులు ఎలాగో కొట్టుకుపోయాయి కాబట్టి ఈ మేడాగారు మళ్లీ కాంట్రాక్టులు తీసుకుంటారేమో..’అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు.

First published:

Tags: AP Assembly, Ap capital, Ap cm jagan, Bjp, Somu veerraju, Ysrcp

ఉత్తమ కథలు