హోమ్ /వార్తలు /national /

Your Leader: హిందూపురంలో బాలయ్య మళ్లీ తొడగొడతారా?

Your Leader: హిందూపురంలో బాలయ్య మళ్లీ తొడగొడతారా?

గత ఎన్నికల్లో 81 వేల 54 ఓట్లు సాధించిన బాలకృష్ణ 16 వేల 196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడంపైనే ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో 81 వేల 54 ఓట్లు సాధించిన బాలకృష్ణ 16 వేల 196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడంపైనే ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో 81 వేల 54 ఓట్లు సాధించిన బాలకృష్ణ 16 వేల 196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడంపైనే ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

  గత ఎన్నికల్లో తొలిసారిగా హిందూపురం అసెంబ్లీ బరిలోకి దిగి విజయం సాధించిన సినీనటుడు బాలకృష్ణ మరోసారి అక్కడి నుంచే అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ రెండేళ్ల క్రితం విమర్శలు ఎదుర్కొన్న బాలకృష్ణ... కొంతకాలంగా హిందూపురంలో అభివృద్ధిపై దృష్టిసారించడం ఆయనకు ఈసారి కలిసివచ్చే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి మైనార్టీ ఓటర్లను దృష్టలో ఉంచుకుని వైసీపీ మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌ కు ఇక్కడ టికెట్ ఇచ్చింది. గతంలో నాలుగుసార్లు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. నందమూరి కుటుంబంపై నియోజకవర్గంలో ఉన్న ఆదరణతో పాటు బాలకృష్ణకు ఒకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడి ఓటర్లు భావించారు. ఈ ఐదేళ్లలో ఓటర్లను మెప్పించడంలో బాలయ్య పూర్తిస్ధాయిలో విజయం సాధించారా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. ముఖ్యంగా గత ఎన్నికల్లో హిందూపురంలో గెలిచిన తర్వాత కొంతకాలం పాటు బాలయ్య నియోజకవర్గానికి రాకుండా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఆయన తరఫున ఆయన పీఏ వీరయ్య బాలకృష్ణ పేరు చెప్పుకుని నియోజకవర్గంలో చేసిన సెటిల్మెంట్లు, బెదిరింపులు సాధారణ ప్రజలతో పాటు టీడీపీ నేతలకు సైతం ఆగ్రహం తెప్పించాయి. అయినా బాలయ్యను ఏమీ అనలేని పరిస్ధితి.

  నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

  హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి అంతంతమాత్రమే. నియోజకవర్గంలో తాగునీరు దొరకని పరిస్ధితి. మౌలిక సౌకర్యాల కల్పన కూడా పరిమితంగానే కనిపిస్తుంది. అడుగడుగునా సమస్యలున్నా బాలయ్య నియోజకవర్గానికి దూరంగా ఉండటం, పీఏ అరాచకాలు మితిమీరడంతో టీడీపీ శ్రేణులు సైతం అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన బాలయ్య రెండేళ్లుగా ఇక్కడ తాగునీటి కల్పనతో పాటు ఇతర సమస్యలపై కాస్త దృష్టిపెట్టారు. అధికారంలో ఉన్నందున ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అమలు చేశారు. దీంతో కొంతకాలంగా బాలయ్య విజయావకాశాలు మెరుగుపడిన‌ట్లు తెలుస్తోంది.

  నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

  హిందూపురం నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల 20 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీ, మైనారిటీ ఓటర్లే ఎక్కువ. అభ్యర్ధుల గెలుపోటముల్లో వీరిదే కీలకపాత్ర. అయినా దశాబ్దాలుగా నందమూరి కుటుంబ సభ్యులను ఆదరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దీంతో నందమూరి కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ ఈసారి మైనార్టీ వర్గానికి చెందిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ను ఇక్కడ బరిలోకి దింపింది. అయినా మైనార్టీలు పూర్తిస్ధాయిలో ఆయనకు సహకరించడం కష్టమేనని తెలుస్తోంది. ఈసారి ఎ‌న్నికల్లో బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర కూడా ప్రచారంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. మరోసారి బాలయ్యకు అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు.

  నందమూరి బాలకృష్ణ, భార్య వసుంధర

  ఐదేళ్ల ప్రభుత్వ పాలనతో పాటు బాలయ్యపైనా నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నా … అది ఆయన విజయంపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువే అనేది ఇక్కడి ఓటర్ల మాట. గత ఎన్నికల్లో 81 వేల 54 ఓట్లు సాధించిన బాలకృష్ణ 16 వేల 196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడంపైనే ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ తో పోటీ చేయించిన వైసీపీ... ఈసారి మైనార్టీ అభ్యర్ధిని రంగంలోకి దింపడం ద్వారా గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

  (సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్‌18)

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Bala Krishna Nandamuri, Hindupur S01p20, Lok Sabha Election 2019

  ఉత్తమ కథలు