హోమ్ /వార్తలు /national /

Ground Report: కర్నూలులో ఆనవాయితీ కొనసాగుతుందా? ఓటర్లు కొత్త రికార్డు సృష్టిస్తారా?

Ground Report: కర్నూలులో ఆనవాయితీ కొనసాగుతుందా? ఓటర్లు కొత్త రికార్డు సృష్టిస్తారా?

మైనారిటీ బలాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన కూడా ఇక్కడ షడ్రక్ అనే అభ్యర్ధిని బరిలో దించింది. అయినా ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్యే ఉంటుందని చెప్పవచ్చు.

మైనారిటీ బలాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన కూడా ఇక్కడ షడ్రక్ అనే అభ్యర్ధిని బరిలో దించింది. అయినా ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్యే ఉంటుందని చెప్పవచ్చు.

మైనారిటీ బలాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన కూడా ఇక్కడ షడ్రక్ అనే అభ్యర్ధిని బరిలో దించింది. అయినా ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్యే ఉంటుందని చెప్పవచ్చు.

  1989లో ఏర్పాటైన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటివరకూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు అవకాశాలు కల్పించింది. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు, కమ్యూనిస్టులు రెండుసార్లు, టీడీపీ, వైసీపీ తలోసారి విజయాలు అందుకున్నాయి. ప్రతీసారి ఎన్నికల్లో ఓ కొత్త అభ్యర్ధిని ఎన్నుకోవడం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేకత.  చారిత్రకంగా, రాజకీయంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కర్నూలు నగరం గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కూడా ఉంది. 1989లో ప్రత్యేక కర్నూలు నియోజకవర్గంగా ఏర్పాటయ్యాక తొలుత కాంగ్రెస్, కమ్యూనిస్టు అభ్యర్ధులు ఇక్కడ విజయం సాధించారు. ఈ తర్వాత టీడీపీ, మళ్లీ కమ్యూనిస్టులకు, గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడి ఓటర్లు విజయాలు కట్టబెట్టారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లున్న కర్నూలులో బీసీలు, మైనారిటీల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎస్సీలు, రెడ్డి సామాజికవర్గం వారు ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఓటర్లు విద్యావంతులు కావడం, స్ధానికంగా ఉన్న కుల సమీకరణాలు, అధికారంలోకి వచ్చే పార్టీలు ఇలా ఎన్నో అంశాలు ఇక్కడ ప్రతీసారి ఎన్నికల్లో కీలకమవుతుంటాయి.

  కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్

  కర్నూలు నగరంలో టీజీ వెంకటేష్ కుటుంబానికి మంచి పట్టుంది. ఇక్కడ మైనారిటీ ఓటర్ల మద్దతు కూడా ఆయన కుటుంబానికి ఉంటుంది. గతంలో ఓసారి టీడీపీ తరఫున, మరోసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ వెంకటేష్ ఈసారి తన కుమారుడు టీజీ భరత్ ను టీడీపీ తరఫున రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో వెంకటేష్ పై వైసీపీ అభ్యర్ధిగా గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి... ఆ తర్వాత పార్టీ ఫిరాయించారు. అయినా ఆయనకు ఈసారి టీడీపీ అవకాశం ఇవ్వలేదు. టీజీ వెంకటేష్ కుటుంబానికి ఉన్న మైనారిటీ ఓటర్ల మద్దతుతో పాటు ఇతర సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఈసారి మైనారిటీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ ను పోటీకి పెట్టింది. దీంతో మైనారిటీ ఓటర్లు ఈసారి హఫీజ్ ఖాన్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. వైసీపీకి ఉన్న సంప్రదాయ మైనార్టీ, ఎస్సీ ఓటు బ్యాంకుతో పాటు గతంలో పార్టీ ఫిరాయించిన ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వలేదన్న కోపంతో హఫీజ్ ఖాన్ కు మద్దతు ఇస్తున్నారు. దీంతో హఫీజ్ ఖాన్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో భూమా కుటుంబానికి జిల్లాలో ఉన్న మంచిపేరు, వైసీపీ ఓటర్ల బలంతో ఎస్వీ మోహన్ రెడ్డి టీజీ వెంకటేష్ పై గెలిచారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించడం, అయినా అభివృద్ధి జరగకపోవడంపై నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

  కర్నూలు వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్

  తుంగభద్రా నది తీరంలో ఉన్న కర్నూలు నియోజకవర్గంలో వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రధాన వృత్తిగా ఉంది. కర్నూలు కొండారెడ్డి బురుజుతో పాటు ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి.. చరిత్రలో చోళులు, కాకతీయులు, మొఘలులు, విజయనగర రాజులు పాలించిన కర్నూలు ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర్యం తర్వాత 1953 నుంచి 1956 వరకూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కూడా ఉన్న కర్నూలు నగరం... చారిత్రక కట్టడాలకు, అలనాటి రాజుల వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

  SV Mohan Reddy, SV Mohan reddy to join YSRCP, SV Mohan Reddy quit TDP, SV Mohan reddy Kurnool, AP Assembly elections, Lok Sabha elections, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, టీడీపీకి ఎస్వీ మోహన్ రెడ్డి గుడ్ బై, వైసీపీలోకి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి షాక్
  ఎస్వీ మోహన్ రెడ్డి (File)

  గతంలో కర్నూలు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ప్రతీసారి ఓటర్లు ఓ కొత్త అభ్యర్ధికి అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. స్ధానిక పరిస్ధితులు, అభివృద్ధి, రాష్ట్రంలో అధికారం చేపట్టే పార్టీ, అభ్యర్ధి గుణగణాలు వంటి ఎన్నో అంశాలు ఇక్కడ విజయాన్ని నిర్దేశిస్తుంటాయి.. సహజంగా టీడీపీకి బీసీ ఓటర్లు, వైసీపీకి రెడ్లు, మైనార్టీలు, ఎస్సీలు అండగా ఉన్నా, మైనారిటీ బలాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన కూడా ఇక్కడ షడ్రక్ అనే అభ్యర్ధిని బరిలో దించింది. అయినా ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్యే ఉంటుందని చెప్పవచ్చు.

  (సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్‌18)

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Kurnool S01p18, Lok Sabha Election 2019

  ఉత్తమ కథలు