హోమ్ /వార్తలు /national /

ఓటర్లకు డబ్బుల పంపిణీ.. వైసీపీ నేతను పట్టుకున్న పోలీసులు

ఓటర్లకు డబ్బుల పంపిణీ.. వైసీపీ నేతను పట్టుకున్న పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 16వ వార్డులో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ వైసీపీ నాయకుడిని పోలీసులు పట్టుకున్నారు.

    ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే ఉంది. ఏపీలో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో ధన ప్రవాహం కూడా పెరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీలు డబ్బులు వెదజల్లడం ప్రారంభించాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 16వ వార్డులో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ వైసీపీ నాయకుడిని పోలీసులు పట్టుకున్నారు. సర్దార్ అనే వైసీపీ నాయకుడి వద్ద రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.100 కోట్ల మేర డబ్బును పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తుండగా వాటిని సీజ్ చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Election Commission of India, Lok Sabha Election 2019, Nellore Dist, Nellore S01p22, Ysrcp

    ఉత్తమ కథలు