పవనే ఏపీ సీఎం..అధికారంలోకి వస్తే ఏపీకి హోదా: మాయావతి కామెంట్స్
పవనే ఏపీ సీఎం..అధికారంలోకి వస్తే ఏపీకి హోదా: మాయావతి కామెంట్స్
మాయావతి, పవన్ కల్యాణ్
మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే తన కలన్నారు పవన్ కల్యాణ్. బీఎస్పీతో కలయికకు దశాబ్ధ కాలం కిందే పునాది పడిందని..కానీ అప్పటి పరిస్థితుల కారణంగా కలవలేకపోయానని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రజలకు ఒక్క అవకాశమివ్వాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి విజ్ఞప్తి చేశారు. జనసేన-సీపీఎం-సీపీఐ-బీఎస్సీ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. పవన్ కల్యాణ్ సీఎం అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయని విమర్శించారు మాయావతి. విశాఖపట్టణంలో పవన్‌కల్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన బీఎస్పీ అధినేత్రి..ఏపీలో తమ కూటమే అధికారంలోకి వస్తుందని, పవన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు.
పవన్ కళ్యాణ్ గారిని మా కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. పవన్ కల్యాణ్‌కు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్‌ని ఎన్నుకోవలసిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడగలిగే ధైర్యం ఆయనకు ఉంది, ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అవుతారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఖచ్ఛిత్వంగా ప్రత్యేక హోదా ఇస్తాం అని హామీ ఇస్తున్నాం.
— మాయావతి, బీఎస్పీ అధినేత్రి
మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే తన కలన్నారు పవన్ కల్యాణ్. బీఎస్పీతో కలయికకు దశాబ్ధ కాలం కిందే పునాది పడిందని..కానీ అప్పటి పరిస్థితుల కారణంగా కలవలేకపోయానని తెలిపారు. రూ.35 వేల కోట్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘనత మాయావతిదేనని స్పష్టంచేశారు.
దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఏదో కారణాలతో అది సాధ్యం కాలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి నేతృత్వం వహించిన మాయావతి ఈ దేశానికి ప్రధాని అవడం చాలా అవసరం. మాయావతిని మనస్ఫూర్తిగా ప్రధాని అభ్యర్థిగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీలు రెండు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయి, అందువల్లే రాష్ట్ర శ్రేయస్సు కోసం మాయావతితో కలిసి పనిచేయాలనుకుంటున్నాం.
— పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఓట్లను చీల్చేందుకే జనసేన-బీఎస్పీ పోటీచేస్తున్నాయన్న విమర్శలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే కలిసి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. ప్రజాప్రయోజనాల కోసమే తాను రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు జనసేనాని.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.