హోమ్ /వార్తలు /national /

'ఈసీ తప్పులకు మేం శిక్ష అనుభవించాలా'..చంద్రబాబు ఓటమిని అంగీకరించారా?

'ఈసీ తప్పులకు మేం శిక్ష అనుభవించాలా'..చంద్రబాబు ఓటమిని అంగీకరించారా?

చంద్రబాబు నాయుడు(File)

చంద్రబాబు నాయుడు(File)

మరమ్మతులు చేసేందుకు వెళ్లిన టెక్నీషియన్స్‌పై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. నిజంగానే రిపేర్ చేశారో లేదంటే ఓట్లను తారుమారు చేశారో..ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని విపక్షానికి ఈసీ సహకరించిందని పరోక్ష్యంగా ఆరోపించారు చంద్రబాబు.

ఇంకా చదవండి ...

'ఈసీ చేసిన తప్పులకు మేం శిక్ష అనుభవించాలా?' అమరావతి ప్రెస్‌మీట్ సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. చంద్రబాబు అలా ఎందుకున్నారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓటమిని ముందే అంగీకరించినందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ చేసిన తప్పిదాల వల్లే తాము ఓడిపోతున్నామని పరోక్షంగా సంకేతాలిచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవీఎం పనితీరుపైనా చంద్రబాబును అనుమానాలు వ్యక్తం చేయడానికి ఇదే కారణం అయిఉంటుందని అంచనావేస్తున్నారు.

ఈవీఎంల రిపేర్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం రిపేర్ పేరిట పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరెవరో వచ్చి వెళ్లారని..వాళ్లంతా ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు వాళ్లని ఎవరు నియమించారని విమర్శలు గుప్పించారు. మరమ్మతులు చేసేందుకు వెళ్లిన టెక్నీషియన్స్‌పై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు.  వాళ్లు నిజంగానే రిపేర్ చేశారో లేదంటే ఓట్లను తారుమారు చేశారో..ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని, విపక్షానికి ఈసీ సహకరించిందని పరోక్షంగా ఆరోపించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఓటమిని అంగీకరించినందుకే  ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ సహా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు గెలుపుపై వైసీపీ శ్రేణులు ధీమావ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఓడిపోబోతున్నారని..ఆయన స్వరంలోనే తెలిసిపోతోందని అభిప్రాయడుతున్నారు. భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని ఇంత ముందే వైసీపీ అధినేత జగన్ ధీమావ్యక్తం చేశారు. ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సైతం.. ఏపీకి పట్టిన చంద్రగ్రహణం వీడిందని, రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీచిందని అన్నారు. ఐతే ఎవరు ఎన్ని చెప్పినా..ఓటర్లు మాత్రం తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మరి ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే..!


First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Chandrababu Naidu, Election Commission of India, EVM, Evm tampering, TDP, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు