హోమ్ /వార్తలు /national /

AP Politics: కుదరదని తేల్చేసిన ప్రభుత్వం.. నేడు ఆందోళనలకు చంద్రబాబు పిలుపు

AP Politics: కుదరదని తేల్చేసిన ప్రభుత్వం.. నేడు ఆందోళనలకు చంద్రబాబు పిలుపు

విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబే-సజ్జల

విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబే-సజ్జల

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై పొలిటికల్ మంటలు చల్లారడం లేదు. ఏపీ ప్రభుత్వం రేట్లు తగ్గించలేమని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో విపక్షాలన్నీ ఆందోళన బాట పడుతున్నాయి. ఇవాళ పెట్రోల్ బంక్ ల దగ్గర నిరసనలకు చంద్రబాబుపు పిలుపు ఇచ్చారు.

ఇంకా చదవండి ...

Petrol Fight:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పెట్రోల్ ధరలు (Petrol Price) రాజకీయ మంటకు కారణమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎక్సైజ్ పన్ను తగ్గించిన తరువాత పలు రాష్ట్రాలు.. పెట్రోల్ ధరలు తగ్గించాయి.. కానీ ఏపీ ప్రభుత్వ (Andhra Pradesh Government) మాత్రం  పెట్రోల్ ధరలు తగ్గించేది లేదని స్పష్టం చేసింది. స్వయనా ఆర్థిక మంత్రి బుగ్గన (minster buggana) దీనిపై క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం చెప్పామని.. ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదని బుగ్గన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా అని.. తాము 24 గంటల్లో నిర్ణయాలు తీసుకోలేమన్నారు. కేంద్ర ఖర్చులు వేరు.. రాష్ట్రాల ఖర్చులు వేరు అని గుర్తుపెట్టుకోవాలి అన్నారు..

పెట్రోలు, డీజిల్‌ ధరల్ని తగ్గించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదని.. వాటిపై సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే మరింత తగ్గించాలని మంత్రి పేర్ని నాని (Minster Perni nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులకు నిజాయతీ, నిబద్ధత ఉంటే లీటరుపై 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా మరో 25 రూపాయలు తగ్గించాలని ప్రధాని మోదీని అడగాలని, అందుకోసం ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌, పార్లమెంటు ముందు ధర్నా చేయాలని పేర్ని నాని సవాల్‌ విసిరారు. కావాలంటే తాను కూడా వస్తానన్నారు.

ఇదీ చదవండి : కొఠియా గ్రామాలు.. జల వివాదాలపై ఫోకస్.. నేడు ఒడిషా సీఎంతో జగన్ భేటీ

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై వచ్చిన ఆదాయంలో వాటా ఇవ్వకపోగా కొవిడ్‌తో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్ని ధర తగ్గించాలని కోరడం ఘోరమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. దాదాపు 90 శాతంపైగా ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వలేదన్నారు. ఇంధన ధరలు భారీగా పెంచి డిస్కౌంట్‌ సేల్‌ మాదిరి 5 రూపాయలు, 10 రూపాయలు తగ్గించారు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై 3.35 లక్షల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వసూలు చేసింది. ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చిన 47,500 కోట్ల రూపాయల ఆదాయాన్నే రాష్ట్రాలకు పంచింది. మిగిలిన 3.15 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఖాతాలోకే వెళ్లాయి. పెట్రోలు, డీజిల్‌ ధరల్ని మరింత తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సజ్జల అన్నారు.

ఇదీ చదవండి : విద్యార్థులపై విరిగిన లాఠీ.. పగిలిన తల.. అణచివేయాలని చూస్తే నేలకొరగడం ఖాయం అంటు లోకేష్ ఫైర్

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ అధినేత  చంద్రబాబు వెల్లడించారు.  మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వంపై జనసేన మరో పోరాటం.. ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ భరోస

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై  16 రూపాయలు, డీజిల్‌పై  17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించినా ఏపీలో తగ్గించకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకునే వరకు ఉద్యమం చేయాలని..  పెట్రోల్ రేట్లు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, Buggana Rajendranath reddy, Chandrababu Naidu, Petrol Price, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు