హోమ్ /వార్తలు /national /

వీరిని మంత్రులు చేస్తా... ముందే ప్రకటించిన జగన్

వీరిని మంత్రులు చేస్తా... ముందే ప్రకటించిన జగన్

వైఎస్ జగన్ : జాతకబలం తక్కువగా ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలరని చెబుతున్నారు. ఇదివరకటి కంటే జగన్ ఈసారి ప్రజాసేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పార్టీని బలోపేతం చెయ్యడంతోపాటూ... ఇతర పార్టీలతో కలిసి సాగితే కలిసొస్తుందంటున్నారు. ప్రజాధరణ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ... చివరి క్షణాల్లో జాతక బలం సరిగా లేనందువల్ల వ్యతిరేక పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయంటున్నారు.

వైఎస్ జగన్ : జాతకబలం తక్కువగా ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలరని చెబుతున్నారు. ఇదివరకటి కంటే జగన్ ఈసారి ప్రజాసేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పార్టీని బలోపేతం చెయ్యడంతోపాటూ... ఇతర పార్టీలతో కలిసి సాగితే కలిసొస్తుందంటున్నారు. ప్రజాధరణ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ... చివరి క్షణాల్లో జాతక బలం సరిగా లేనందువల్ల వ్యతిరేక పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయంటున్నారు.

ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి చేస్తాననే హామీ ఎలా ఉన్నా... కుప్పంలో గెలిచే అవకాశం లేని చంద్రమౌళికి వైఎస్ జగన్‌ మంత్రి పదవి ఆఫర్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  ఏపీ ఎన్నికల్లో టీడీపీతో హోరాహోరీగా పోటీ పడుతున్న విపక్ష వైసీపీ... ఈ సారి కచ్చితంగా అధికారం తమదే అనే ధీమాలో ఉంది. పలు సర్వేలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉండటంతో... ఈ సారి కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ప్రచారాన్ని ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని బహిరంగంగానే చెబుతున్న జగన్... మంత్రులుగా ఎవరికి ఎంపిక చేసుకుంటారనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.

  అయితే కొందరు అభ్యర్థులు గెలిస్తే... వారిని మంత్రులు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటిస్తున్నారు జగన్. కొద్ది రోజుల క్రితం ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్... వైసీపీ అధికారంలోకి వచ్చి, ఒంగోలు వైసీపీ అభ్యర్థి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని వ్యాఖ్యానించారు. తాజాగా మరో వైసీపీ అభ్యర్థికి కూడా జగన్ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం విశేషం. కుప్పంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీ చేస్తున్న చంద్రమౌళిని గెలిపిస్తే...మంత్రిని చేస్తానని కుప్పం ఎన్నికల సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. కుప్పంకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.

  ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి చేస్తాననే హామీ ఎలా ఉన్నా... కుప్పంలో గెలిచే అవకాశం లేని చంద్రమౌళికి జగన్‌ మంత్రి పదవి ఆఫర్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు మెజార్టీని సాధ్యమైనంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ రకమైన ప్రకటన చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వీరిద్దరితో పాటు భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్న గ్రంధి శ్రీనుకు కూడా మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Chittoor S01p25, Lok Sabha Election 2019, Ongole S01p16, TDP, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు