హోమ్ /వార్తలు /national /

చంద్రబాబు ఇలాఖాపై కన్నేసిన వైసీపీ... గెలుపు కోసం కొత్త వ్యూహం

చంద్రబాబు ఇలాఖాపై కన్నేసిన వైసీపీ... గెలుపు కోసం కొత్త వ్యూహం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

కాంగ్రెస్ హవా బలంగా వీచిన సమయంలోనూ రాష్ట్రంలో చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడానికి అసలు కారణం... చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఆ పార్టీకి మెజార్టీ రావడమే.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో తిరుగులేదు. మూడున్నర దశాబ్దాల నుంచి కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా కొనసాగుతున్న చంద్రబాబు... చిత్తూరు ఎంపీ సీటు గెలవడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ హవా బలంగా వీచిన సమయంలోనూ రాష్ట్రంలో చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడానికి అసలు కారణం... చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో ఆ పార్టీకి మెజార్టీ రావడమే. ఈ కారణంగానే 1996 నుంచి టీడీపీ లోక్ సభ స్థానాన్ని వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్తూరు లోక్ సభ స్థానంలో టీడీపీకి ఓటమి లేకపోవడం విశేషం.

చిత్తూరు పరిధిలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి ఓట్లు తక్కువగా వచ్చినా... ఒక్క కుప్పంలో వచ్చే మెజార్టీ ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థి గెలుపును ఖరారు చేస్తోందని గత ఫలితాలను బట్టి అర్థమవుతోంది. దీంతో ఈ సారి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీని సాధ్యమైనంతగా తగ్గించేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించడం సాధ్యంకాదనే విషయం వైసీపీకి కూడా తెలుసు.

అయితే ఆయన మెజార్టీని ఎంత వీలైతే అంతగా తగ్గించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల చిత్తూరు లోక్ సభ స్థానాన్ని తమ సొంతం చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. దీనికి తోడు కుప్పంలో ప్రచారం సందర్భంగా ఎంపీ అభ్యర్థికి మాత్రం వైసీపీకే ఓటు వేయాలని ఆ పార్టీ శ్రేణులు ప్రజలను కోరుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీకి కంచుకోటగా మారిన చిత్తూరు లోక్‌సభ స్థానాన్ని ఈసారి వైసీపీ గెలుచుకుంటుందా అన్నది చూడాలి.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chittoor S01p25, Lok Sabha Election 2019

ఉత్తమ కథలు