హోమ్ /వార్తలు /national /

Andhra Pradesh: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్: 90 రోజుల్లో తీరనున్న సొంతింటి కల: ఆగస్టు 15 నుంచి విలేజ్ క్లీనిక్ లు

Andhra Pradesh: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్: 90 రోజుల్లో తీరనున్న సొంతింటి కల: ఆగస్టు 15 నుంచి విలేజ్ క్లీనిక్ లు

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీలో పేద ప్రజలకు మరో తీపి కబురు చెప్పారు సీఎం వైఎస్ జగన్. కేవలం 90 రోజుల్లోనే లబ్ధి దారులకు సొంతింటి కల నెరవేరాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి గ్రామంలోనూ ఆగస్టు 15 నుంచి విలేజ్ క్లీనిక్ లు ప్రారంభమవ్వాలని డెడ్ లైన్ పెట్టారు.

ఇంకా చదవండి ...

ఏపీలో పేద ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్.. ఏపీలో ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఏప్రిల్‌, మే నెలలో అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు జగన్ పలు సూచనలు చేశారు. మే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి సాకులూ చెప్పకుండా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చాలాచోట్ల పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరణ ఇచ్చారు. మిగిలినవాటిని సైతం త్వరగా పూర్తి చేయాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు..

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టినందుకు.. ఆయన అధికారులను స్వయంగా అభినందించారు. కరోనా మహమ్మారి భయపెట్టిన సమయంలోనూ అధికారుల పనితీరు ప్రశంసనీయమన్నారు. అలాగే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు త్వరులో అన్ని గ్రామాలకు విలేజ్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అయితే వీటి నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కరోనా చాలా వేగంగా విస్తరిస్తోందని.. ఆ కేసులకు అడ్డుకట్ట వేయడంలో విలేజ్ క్లీనిక్ లు చాలా ఉపయోగపడతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అధికారులు పని చేయాలని ఆదేశించారు..

రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల 899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సెప్టెంబర్‌ నెలలో బీఎంసీలను ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే 25 ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూములను గుర్తించాలని.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక యూనిట్‌ చొప్పున వాటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఏపీలో అర్హులు అందరికీ 90 రోజుల్లోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 1 లక్షా 69 వేల 558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిళ్లు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని జగన్ మరోసారి స్పష్టం చేశారు. దీనిలో ఎన్ని నష్టాలు ఎదురైనా అనుకున్న సమయానికి అందరికీ ఇళ్ల పట్టాలు అందేలా చేయాలని అధికారులు సీఎం జగన్ ఆదేశించారు. మరోవైపు ఇప్పటికే ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్నది సీఎం జగన్ ధృఢ సంకల్పం అని అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. కోర్టు కేసుల కారణంగానే పంపిణీ నిలిచిపోయాయని  ప్రభుత్వం అంటోంది. కొన్ని చోట్ల దళితుల భూమలు లాక్కొన్నారనే ఆరోపణలతో కొందరు కోర్టును ఆశ్రయిస్తే.. మరికొన్ని చోట్ల నీటి మునిగే భూములకు పట్టాలిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఆరోపణలు ఎలా ఉన్నా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై పలు కేసులు ప్రస్తుతం విచారణ దశలోనే ఉన్నాయి. దీంతో తాత్కాలికంగా 3.77 లక్షల మందికిపైగా పేదల గూడుకు అడ్డు తగిలింది. అయితే వారందరికీ అధికారులు లేఖలు రాశారు. ఎవరూ అధైర్య పడవద్దని.. త్వరలోనే అందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇస్తూ ఇప్పటికే లేఖలు రాశారు కూడా.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, AP News, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు