Home /News /national /

POLITICS ANDHRA PRADESH TDP LEADER NARA LOKESH SLAMS CM YS JAGAN OVER ATTACKS ON DALITS

ఓటేసిన వారినే కాటేస్తున్నారు..జగన్‌పై నారా లోకేష్ ఆరోపణలు

ప్రస్తుతం భీమిలిపై అవంతి పూర్తి పట్టు సాధించారు. ఇలాంటి సమయంలో ఆయనను ఢీ కొట్టడం అంతా ఈజీ కాదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ తెప్పించుకున్న రిపోర్టుల్లో మాత్రం భీమిలిలో అయితే గెలిచేందుకు అవకాశం ఉందని.. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత సబ్బం హరి.. టీడీపీ కేడర్ పటిష్ట పరిచారని.. ప్రస్తుతం టీడీపీ అన్నీ అక్కడ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్(CM Jagan) తనకు ఓటేసిన వారినే కాటేస్తున్నారంటూ టీడీపీ(Telugu Desam Party) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విరుచుపడ్డారు.

    గత ఎన్నికల్లో తనకు ఓటేసిన వారినే సీఎం జగన్ కాటేస్తున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుపడ్డారు. మద్యపాన నిషేధం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్‌ను బలితీసుకున్నారని ఆరోపించారు. ఆ మేరకు అతని ఫోటోలను కూడా నారా లోకేష్ ట్వీట్ చేశారు. చంపేస్తామంటూ వైసీపీ నేతలు, పోలీసుల కారణంగానే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమాల మండలం కందూరు గ్రామానికి చెందిన ఓ ప్రతాప్ చనిపోయాడని ఆరోపించారు. ఓం ప్రతాప్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ప్రమేయమున్న వైసీపీ ముఖ్య నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

    ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు దళితులకు లేదా? అని ప్రశ్నించారు. దళితులపై జగన్ ప్రభుత్వ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు