హోమ్ /వార్తలు /national /

AP Politics: ఎవర్నీ వదిలిపెట్టం.. అందరి చిట్టా రెడీ.., అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

AP Politics: ఎవర్నీ వదిలిపెట్టం.. అందరి చిట్టా రెడీ.., అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడు, సీఎం జగన్

అచ్చెన్నాయుడు, సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయాలు రోజురోజుకీ వాతవరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham party) ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ వాతవరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు – ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు, వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు యుద్ధాన్ని క్షేత్రాన్ని తలపిస్తున్నాయి.ఆలయాలపై దాడుల విషయంలో మొదలైన వివాదం బహిరంగ చర్చలు, పరస్పర దాడులకు దారితీస్తోంది. అటు పోలీసులను కూడా రాజకీయాలకు లింక్ పెడుతూ విమర్శల జోరు పెరుగుతోంది. ఈక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక సమీపిస్తున్నందున పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయాన్ని అచ్చెన్నాయుడు ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రులు, నేతలను టార్గెట్ చేసిన అచ్చెన్న.. పోలీసులకు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు.

  పోలీసులా..? వైసీపీ కార్యకర్తలా..?

  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా తామేం ఊరికే కూర్చొలేదని.., తమను టార్గెట్ చేసిన అధికారులు, పోలీసుల చిట్టా తయారువుతోందని.. అధికారంలోకి వస్తే ఒక్కర్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్.., వైసీపీ నేతలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

  రోజుకో వేషం..

  ముఖ్యమంత్రి జగన్‌ రోజుకో వేషంలో ప్రజలను మోసం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించి ఆలయాలకు శంకుస్థానలు, గోపూజలు చేస్తూ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. లౌకికవాదమే తెలుగుదేశం మూల సిద్ధాంతమని.. అయితే ఇటీవల కొన్ని వర్గాలు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతోందన్న అచ్చెన్న.., హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని మీరు ఒకటంటే మేం రెండంటామంటూ హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.

  ఇక తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే సీఎం జగన్ కు కనీసం పరామర్శించే తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు. ఓ మంత్రి తల్లి చనిపోయినా, కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ చనిపోతే హెలికాఫ్టర్ లో వెళ్లిన ముఖ్యమంత్రికి దళిత ఎంపీ చనిపోతే పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులంతా సీఎంను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, AP Politics, Kinjarapu Atchannaidu, Tdp, Tirupati Loksabha by-poll, Ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు