హోమ్ /వార్తలు /national /

AP Politics: ఏపీ ప్రభుత్వంపై జనసేన మరో పోరాటం.. ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ భరోస

AP Politics: ఏపీ ప్రభుత్వంపై జనసేన మరో పోరాటం.. ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ భరోస

హరీష్ శంకర్ సినిమా తర్వాత జేబు దొంగ రీమేక్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ కుదిరి పవన్ నిజంగానే చిరంజీవి సినిమా రీమేక్‌లో నటిస్తే మాత్రం అంతకంటే అభిమానులకు కావాల్సిందేం లేదు. ఎందుకంటే చిరంజీవి సినిమాలో పవన్ నటిస్తే అంతకంటే అభిమానులకు సంతోషం మరోటి లేదు. పైగా చిరు మాస్ కమర్షియల్ సినిమా రీమేక్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. జేబుదొంగ కథను ఉన్నదున్నట్లు కాకుండా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు మార్చి రీమేక్ చేయాలనే ఆలోచనలు అయితే చేస్తున్నారు.

హరీష్ శంకర్ సినిమా తర్వాత జేబు దొంగ రీమేక్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ కుదిరి పవన్ నిజంగానే చిరంజీవి సినిమా రీమేక్‌లో నటిస్తే మాత్రం అంతకంటే అభిమానులకు కావాల్సిందేం లేదు. ఎందుకంటే చిరంజీవి సినిమాలో పవన్ నటిస్తే అంతకంటే అభిమానులకు సంతోషం మరోటి లేదు. పైగా చిరు మాస్ కమర్షియల్ సినిమా రీమేక్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. జేబుదొంగ కథను ఉన్నదున్నట్లు కాకుండా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు మార్చి రీమేక్ చేయాలనే ఆలోచనలు అయితే చేస్తున్నారు.

Pawan on YCP: మొన్న నిరుద్యోగుల సమస్య.. నిన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. నేడు మరో అంశంపై పోరాడేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఏపీ ప్రభుత్వం తీరుపై ఇటీవల విమర్శల దాడి పెంచిన పవన్.. ఇప్పుడు ఆ ఉద్యోగుల తరపున పోరాడుతాను అంటూ వారికి భోరసా కల్పించారు..

ఇంకా చదవండి ...

  AP Politics: పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సమస్యలపై వరుసగా నిరసన గళం ఎత్తుతున్నారు.. అప్పుడప్పుడు వచ్చి పోవడం కన్నా నిత్యం పోరాటలతో ప్రజల్లో ఉండడమే మేలని ఆయన భావిస్తున్నారు. దీంతో వరుస సమస్యలపై పోరాటలకు సై అంటున్నారు. సమయం చిక్కినప్పుడల్లా ఏపీ ప్రభుత్వం (AP Government) పై విమర్శల భాణం ఎక్కుపెడుతున్నారు. ఓ వైపు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉద్యమం విషయంలో ప్రభుత్వం కార్యచరణ ఏంటో వారం రోజుల్లో చెప్పాలి అంటూ వారం రోజుల పాటు డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ ముగిసినా ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.. దీంతో ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే ఆసక్తి అందరిలో పెరిగింది. మరోవైపు పవన్ మరో సమస్యపై ఫోకస్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా ఉంటాం.. వారి తరఫున ప్రభుత్వంపై పోరాడతాం.. జనసేన అధినేత పవన్‌ భరోసా కల్పించారు..

  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా వారి సహేతుకమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2010లో టీటీడీ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని.. ఆ విధంగానే సొసైటీలు ఏర్పాటయ్యాయని పవన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత హితవు పలికారు.

  ఇదీ చదవండి : పెట్రోల్, డీజిల్‌ వ్యాట్ తగ్గింపుపై ఏపీ నిర్ణయం ఇదే.. మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు

  నిధుల మళ్లింపునకే కొత్త కార్పొరేషన్‌..

  వైసీపీ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పవన్ విమర్శించారు. ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు విలీనం లాగే ఇప్పుడు టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డుమీదుకు లాగుతోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ గా మార్చాలనుకుంటోందని ఆరోపించారు. ఇది ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్య.

  ఇదీ చదవండి :ఏపీలో ఆగని పెట్రో ఫైట్.. కాషాయ నేతలు నీతులు చెప్పడం విడ్డూరమన్న మంత్రి..

  ఒకే పని చేస్తున్న రెగ్యులర్ కార్మికులకు, ఒప్పంద కార్మికులకు కానీ ఒకే వేతనం చెల్లించాలన్న జస్టిస్ సుప్రీంకోర్డు 2016 లో వెలువరించిన తీర్పును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కార్పొరేషన్లో చేరని వారిని ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. నిధులు దారి మళ్లించేందుకే ప్రభుత్వం కొత్తగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తోంది. టీటీడీ కార్మికులకు అండగా ఉంటామన్న జగన్మోహన్‌ రెడ్డి వారికి పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చారు? 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది’ అని పవన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pawan kalyan, Ttd news, Ysrcp

  ఉత్తమ కథలు