P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18 Ap Political Fight: ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాశించారు. ఆయన చెప్పిందే శాసనం అనేట్టు పరిస్థితి ఉండేది. తరువాత పరిమాణల క్రమంలో ఎదురు దెబ్బల నుంచి తేరుకుని వైసీపీకి గూటికి చేరాక మళ్లీ మంత్రి పదవి అందుకున్నారు. సీనియర్ మంత్రిగా.. జిల్లాలో పట్టు ఉన్న నేతగా అంతా తానై చక్రం తిప్పాలి అనుకున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన నేత ఆయన. ఒకానొక సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముఖ్యనేతలంతా క్యూ కట్టేవారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ సీనియర్ నేత తన చేతిలో పదవి ఉన్నా నియోజకవర్గానికే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కానీ స్థానిక ఎమ్మెల్యేలే ఆయనకు షాకిస్తున్నారు. ఒకప్పుడు తాను ప్రోత్సహించిన ఎమ్మెల్యేలే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుండడంతో ఆ మంత్రి సైలెంట్ అవ్వక తప్పడం లేదు.. ఇంతకీ ఎవరా మంత్రి... ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారా..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉత్తరాంధ్ర రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకున్న బొత్స సత్యన్నారాయణ ఇప్పుడు కనీసం విజయనగరం జిల్లాలో కూడా తన ప్రభావం చూపించ లేకపోతున్నారనేది స్థానికుల మాట. వై.ఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల నేపధ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స అప్పట్లో జగన్ పై తీవ్రమైన విమర్శలే చేశారు. ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్ఆర్సీపీలో చేరి అందరికీ షాకిచ్చారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విశాఖలో నాలుగు.. శ్రీకాకుళంలో రెండు సీట్లు మినహా అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసింది. విజయనగరం నుండి బొత్సా సత్యనారాయణ... ఎస్టీ వర్గం నుండి పుష్ప శ్రీవాణీ డిప్యూటీ సీఎం హోదాలో కేబినెట్ లో ఉన్నారు.
ఇదీ చదవండి: గంటాను టీడీపీ పెద్దలు పక్కన పెట్టారా..? భీమిలి, నార్త్ నియోజవర్గాలపై ఆ ఇద్దరూ ఫోకస్
పేరుకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా బొత్స చేతిలో అధికారం ఏమీ లేదన్నది స్థానిక పబ్లిక్ టాక్. ఉత్తరాంధ్రకు విజయ సాయి రెడ్డి పార్టీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం జరుగుతోందని.. విజయనగరంలోనూ బొత్సా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టే వ్యూహాలు వైసీపీలో అమలు అతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలోనూ మంత్రి బొత్స చెల్లుబాటు కావడం లేదని.. కేవలం ఆయన వర్గం మాత్రమే ఒంటరైందనే ప్రచారం ఉంది. తాజాగా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామపై అనర్హత వేటు లేనట్టేనా..? లోక్ సభ స్పీకర్ తీరుపై వైసీపీ అసహనం
విజయనగరం జిల్లాకు చెందిన పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తీరు ఇప్పుడు చర్చకు కారణమైంది. తాజాగా జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన హౌసింగ్ స్కీం..ఇంటి స్థలాల కేటాయింపు పైన మంత్రి బొత్సాను నిలదీసారు. ఇప్పటికే కేటాయించిన ప్రాంతం నుండి తమకు మరో స్థలం మార్చాలంటూ స్థానికులు కోరుతున్నారంటూ ఓపెన్ గా సమావేశంలోనే చెప్పుకొచ్చారు. ఇది మంత్రి బొత్సాకు ఆగ్రహం తెప్పించింది. ఎమ్మెల్యేగా ఉంటూ.. తన కో.. సంబంధిత జిల్లా అధికారికో చెపితే సమస్య పరిష్కరించే వారమని.. ఇలా ఓపెన్ సమావేశంలో ప్రశ్నించటం ఏంటని బొత్సా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అయినా ప్రస్తుత పరిస్థితిలో స్థల మార్పు జరగదని.. కావాలంటే అక్కడ మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. అంతటితో జోగారావు ఆగలేదు. మరింతగా బొత్సాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది. అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. బొత్సా ఆగ్రహం వ్యక్తం చేయటంతో ..జోగారావు సైతం స్వరం పెంచారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే ఎలా అంటూ బొత్సా ప్రశ్నించారు.
ఇదీ చదవండి: పార్టీ ప్రకటన తొలి రోజే జగన్ కు షర్మిల రివర్స్ పంచ్.. అన్నపై విమర్శలు..!
కేవలం జోగారావు మాత్రమే కాదు విజయనగరానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కోలగట్లతో సహా బొత్సకు విబేధాలు ఉన్నాయి. గతంలో మున్నిపాలిటీ ఎన్నికల సమయంలో కోలగట్ల మాటే నెగ్గింది. బొత్స తనకు కావాల్సిన వారికి సీట్లు కూడా ఇప్పించుకోలేకపోయారు. త్వరలో జరిగే నామినేటేడ్ పదవుల్లో సైతం బొత్స వర్గానికి చెక్ పెట్టే పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. చేతిలో మంత్రి పదవి ఉన్నా ఏం చేయలేని పరిస్థితి ఉందంటు సన్నిహితుల దగ్గర బొత్స వాపోయినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చేస్తే మంత్రి వర్గ విస్తీర్ణంలో బొత్సను కొనసాగిస్తారా..? తప్పిస్తారా అనే టెన్షన్ ఆయన వర్గీయుల్లో మొదలైంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Botsa satyanarayana, Vijayasai reddy, Vizianagaram