Andhra Pradesh Politics: వైసీపీ వర్సెస్ బీజేపీ (YCP vs Bjp) అన్నట్టుగా మారింది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా పెట్రోల్ (Petrol)రేట్ల తగ్గింపు వ్యవహారం రెండు పార్టీల మధ్య చిచ్చు పెంచుతోంది. బద్వేల్ ఉప ఎన్నిక (badvel by poll) ముందు ఈ రెండు పార్టీల మొదట మైదలై మాటల తూటాలు.. పెట్రోల్ రేట్ల అంశంతో తారా స్థాయికి చేరాయి. తాజాగా బీజేపీ నేతల విమర్శలపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని గుర్తు చేశారు. రాకెట్ కంటే వేగంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లీటరు పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే దాన్ని 110 పైకి తీసుకెళ్లిన ఘనత బీజేపీదే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు.
అక్టోబర్లో ధర ఎంత ఉంది? నవంబర్లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. నింజాగా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి అని పిలుపు ఇచ్చారు. నిజంగా ప్రజలపై జాలి, దయ ఉంటే.. 5 రూపాయలు కాదు 25 రూపాయలు తగ్గించాలని కేంద్రాన్ని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేయాలన్నారు. సెస్ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : రేపు ఒడిషాకు సీఎం జగన్.. అక్కడి సీఎంతో చర్చించే అంశాలు ఎంటంటే.. షెడ్యూల్ ఇదే
అంతకుముందు ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోము వీర్రాజు. జగనుకు మోడీ భయం పట్టుకుందన్నారు. మోదీతో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నాం. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు అని నిలదీశారు. తాము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే పార్థసారథి ఎందుకు చెప్పలేదు. వైసీపీకి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, రాజధాని తెస్తామని ప్రజలను మోసం చేశారన్నారు.
ఇదీ చదవండి :ముగిసిన పవన్ డెడ్ లైన్.. లైట్ తీసుకున్న అధికార వైసీపీ.. మరి జనసేనాని ఏం చేస్తారు..?
ఏపీలో 2500 కోట్లు రాజధానికి ఇచ్చాం.. 4700 కోట్ల రుణం ఇప్పించాం. రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్ ప్రభుత్వం.. గోతులు తవ్వే రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మాట ఇచ్చి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు. రాజధానిపై ఇచ్చిన మాటను ఎందుకు తప్పారు. రాజధాని నిర్మాణం పేరుతో 4 సెస్ వసూలు చేస్తూ రాజధాని ఎందుకు నిర్మించడం లేదు అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :హీటు పెంచుతున్న కుప్పం.. చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?
దేశంలో ప్రజలపై భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, అయిల్ ధరలు తగ్గించింది. ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ఏపీ దేశంలో ఉందా లేదా అనేది జగన్ చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరి వితండవాదంగా ఉంది. ప్రజాధనం వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకుంది అన్నారు సోము వీర్రాజు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Ap minister perni nani, AP News, AP Politics, Ysrcp