హోమ్ /వార్తలు /national /

చిరంజీవి వల్లే ఎదిగాడు... వైసీపీ అభ్యర్థిపై పవన్ కళ్యాణ్ ఫైర్

చిరంజీవి వల్లే ఎదిగాడు... వైసీపీ అభ్యర్థిపై పవన్ కళ్యాణ్ ఫైర్

పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

కాపులకు రిజర్వేషన్లు కుదరవని చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని కన్నబాబు భజన చేస్తున్నాడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

  ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై మాటల దాడిని మరింతగా పెంచుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్... కాకినాడ రూరల్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నబాబును తానే స్వయంగా వచ్చి తరిమి తరిమి కొడతానని పవన్ మండిపడ్డారు. కన్నబాబు ఒక అధముడని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్... ప్రజా పోరాటాల నుంచి పారిపోయే వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. తన అన్న చిరంజీవి వల్లే కన్నబాబు పైకొచ్చాడని పవన్ కళ్యాణ్ అన్నారు.

  అలాంటి కన్నబాబు ఈ రోజు తమపైనే వేలెత్తి చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు ఒళ్ళుదగ్గర పెట్టుకుని ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు కుదరవని చెప్పిన జగన్ పక్కన కూర్చుని కన్నబాబు భజన చేస్తున్నాడని మండిపడ్డారు. కన్నబాబు ప్రశాంతమైన కాకినాడలో కడప ఫ్యాక్షన్ సంస్కృతిని తేవాలనుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2009లో కాకినాడ రూరల్ నుంచి పీఆర్‌పీ తరపున పోటీ చేసి గెలిచిన కురసాల కన్నబాబు... గత ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరిన కన్నబాబు... ప్రస్తుతం కాకినాడ రూరల్ స్థానం నుంచి ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Kakinada S01p06, Lok Sabha Election 2019, Pawan kalyan

  ఉత్తమ కథలు