హోమ్ /వార్తలు /national /

MLA Roja: నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఎమ్మెల్యే రోజా కన్నీళ్ల పర్యంతం..

MLA Roja: నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఎమ్మెల్యే రోజా కన్నీళ్ల పర్యంతం..

సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతుంది.

సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతుంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా (MLA RK Roja) అంటే ఫైర్.., ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. అలాంటి రోజా అందరి ముందూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా అంటే ఫైర్.., ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. అలాంటి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనను పట్టించుకోవడం లేదని కనీసం అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాలకు కూడా ప్రొటోకాల్ పాటించడం లేదని రోజా ఆరోపించినట్లు సమాచారం.

  ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపణలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. రోజా ఓ రోడ్డు విషయంలో పనులు కావడం లేదని మాత్రమే ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ అంశం తన పరిధిలో లేకపోయినా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించినట్లు వెల్లడించారు. ప్రొటోకాల్ విషయంలో ఏ శాసన సభ్యుడికి అన్యాయం జరిగినా తాము చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభా హక్కులు కాపాడటంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడాలేదని కాకాణి స్పష్టం చేశారు.

  ఐతే తన విషయంలో జరగుతున్న పరిణామాలపై చాన్నాళ్లుగా ఎమ్మెల్యే రోజా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం., వాటిపై కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొన్నామధ్య ఇదే విషయంలో రోజాకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో  వివాదం సద్దుమణిగింది. ఐతే ఇటీవల చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో టీటీడీకి చెందిన 6వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా తనను పిలవకపోవడంపై రోజా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారని ఆమె సన్నహితులతో అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: AP Assembly, MLA Roja, Roja Selvamani, Tirupati, Ysrcp

  ఉత్తమ కథలు