Home /News /national /

POLITICS ANDHRA PRADESH MINISTER MEKAPATI GOUTHAM REDDY COUNTERS JANASENA PARTY CHIEF PAWAN KALIAN ON DIVIS LAB ISSUE PRN

Divi’s Lab Issue: పవన్ అప్పుడెందుకు ప్రశ్నించలేదు..? జనసేనానికి మంత్రి కౌంటర్..!

పవన్ కల్యాణ్ పై మండిపడ్డ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

పవన్ కల్యాణ్ పై మండిపడ్డ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లా (East Godawari District), తొండంగి మండలంలో ఏర్పాటవుతున్న దివీస్ (Divi’s Lab) పరిశ్రమ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన జనసేన (Janasena party) అధినేత పవన్ కల్యాణ్ (Pawana Kalyan) కు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలంలో ఏర్పాటవుతున్న దివీస్ పరిశ్రమ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దివీస్ ల్యాబ్ వద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతిస్తుండగా..అధికార పక్షం మాత్రం పరిశ్రమ ఏర్పాటుకే మొగ్గు చూపుతోంది. ఐతే ప్రతిపక్షంలో ఉండగా దివీస్ ను వైసీపీ వ్యతిరేకించడం., అధికారంలోకి వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా దివీస్ బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ చేసిన విమర్శలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి.., టీడీపీ ప్రభుత్వం అనుమతులిచ్చినప్పుడు ఏం చేశారని ప్రశ్చించారు.

    నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి గౌతమ్ రెడ్డి.. పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే దివీస్‌ పరిశ్రమకు అనుమతులిచ్చారని.. అప్పట్లో టీడీపీతో కలిసున్నది మీరే కదా అని ప్రశ్నించారు. అప్పుడు టీడీపీని పవన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. స్థానికుల అబ్యంతరాలు, సమస్యలను పరిష్కరించకుండా ముందుకెళ్లొద్దని దివీస్ ను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పరిశ్రమలు, మత్స్యశాఖల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

    ఇక రాష్ట్రంలో పరిశ్రమలపై పవన్ కల్యాణ్ అవనగాహన లేకుండా మాట్లాడుతున్నారని.., నిజానికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొట్టొద్దని పవన్ కు హితవు పలికారు. పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులకు, అలాగే చుట్టుపక్కల గ్రామాల వారికి ఉద్యోగంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం వృత్తి నైపుణ్య కోర్సులను నిర్వహిస్తున్నామని.., పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అన్ని అనుమతులు ఉండాల్సిందేని స్పష్టం చేశారు. ఇక ప్రజల ప్రాణాలపై పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు ఆపాలని చెప్పాలని గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు.

    పవన్ ఏమన్నారంటే..!
    నిన్న తొండంగిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..,తాను అధికారంలోకి వస్తే దివీస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్ ఇప్పుడు అదే కంపెనీకి వత్తాసు పలడాన్ని పవన్ తప్పుపట్టారు. ఏ పరిశ్రమ అయినా చట్టాలకు లోబడే ఉండాలి. దివీస్ పరిశ్రమపై నాకు ఎలాంటి కోపం లేదు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదని ఆ పరిశ్రమ నిరూపించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించాలని పవన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరఫున పోరాటం చేయడానికి జనసేన వెనుకాడదని హెచ్చరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, East Godavari Dist, Farmers, Janasena, Mekapati Goutham Reddy, Pawan kalyan, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు