హోమ్ /వార్తలు /national /

జనసేన నాలుగో జాబితా విడుదల... విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ

జనసేన నాలుగో జాబితా విడుదల... విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ

పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)

Janasena candidates list | జనసేన అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థికి ఈ జాబితాలో చోటు కల్పించింది. ఇటీవల పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ లోక్ సభ స్థానాన్ని కేటాయించింది.

ఇంకా చదవండి ...

ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థులకు సంబంధించిన నాలుగో జాబితాను విడుదల చేసింది జనసేన. 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థికి ఈ జాబితాలో చోటు కల్పించింది. ఇటీవల పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఆయన తోడల్లుడు, అనే విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా పని చేసిన రాజగోపాల్‌కు పార్టీ పదవి కేటాయించబోతున్నట్టు ప్రకటించింది. ఇక జనసేన పార్టీ ప్రకటించిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల వివరాలు ఈ రకంగా ఉన్నాయి.

విశాఖపట్నం ఉత్తరం - పసుపులేని ఉషా కిరణ్

విశాఖపట్నం దక్షిణం - గంపల గిరిధర్

విశాఖపట్నం తూర్పు - కోన తాతారావు

భీమిలి - పంచకర్ల సందీప్

అమలాపురం - శెట్టిబత్తుల రాజబాబు

పెద్దాపురం - తుమ్మల రామస్వామి

పోలవరం - చిర్రి బాలరాజు

అనంతపురం - టీ సీ వరుణ్

ఇక పొత్తుల్లో భాగంగా వామపక్షాలు, బీఎస్పీకి పలు స్థానాలను కేటాయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్టు జనసేన ప్రకటించడంతో... జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఇంకా మరికొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో... వాటిని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Janasena, Lok Sabha Election 2019, Pawan kalyan, Tdp, Visakhapatnam S01p04, Ysrcp

ఉత్తమ కథలు