హోమ్ /వార్తలు /national /

YS Jagan: పదేళ్ల తర్వాత వైఎస్ జగన్ ఏమవుతారో తెలుసా..? డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

YS Jagan: పదేళ్ల తర్వాత వైఎస్ జగన్ ఏమవుతారో తెలుసా..? డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం నారాయణ స్వామి Dy.CM Naeayana Swamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ని కొట్టేవారే లేరని ఆయన వ్యాఖ్యానించారు.

  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొట్టేవారే లేరని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మరో 35 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆయన్ను గెలిపిస్తాయన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు, అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో 90శాతానికి పైగా హామీలను అమలుచేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుంతుందని నారాయణ స్వామి అన్నారు. సీఎం జగన్ కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని.., తెలంగాణ, ఆంధ్ర లో జగన్ కు అభిమాన సంఘాలు పెట్టుకుంటున్నారన్నారు.

  ఇక పదేళ్ల తర్వాత జగన్ కు దేశానికి ఏమవుతాడో మీరే చూస్తారని అన్నారు. బీజేపీ ఎన్ని యాత్రలు చేసినా జగన్ ఏపీకి 35ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు నారాయణ స్వామి. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు.

  Andhra Pradesh Deputy CM Narayana swamy Made interesting comments on Chief Minister YS JaganmohanReddy
  ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి(ఫైల్ ఫోటో)

  ఇక ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రొటోకాల్ విషయంలో చేసిన ఫిర్యాదుపైనా నారాయణ స్వామి స్పందించారు. రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఆమె ఎందుకు కంటతడి పెట్టారో అర్ధం కాలేదన్నారు. తనకు గ్రూపు రాజకీయాలు చేయడం చేతకాదన్న ఆయన.., అందర్నీ కలుపుకుని వెళ్లడమే తన నైజమన్నారు. తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని.., రోజా ఎందుకు అలా మాట్లాడిందో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తాను ప్రతి ఒక్కరికీ దండం పెట్టుకుని వెళ్ళేవాడినే తప్ప ఎవర్నీ ఇబ్బంది పెట్టనన్నారు.

  ఇక మంత్రి అయిన కొత్తలో కొంత సైలెంట్ గా ఉన్న నారాయణ స్వామి ఇటీవల కాస్త జోరు పెంచారు. ఈ క్రమంలో సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారాయన. తనపై వస్తున్న ఒత్తడిని తట్టుకోలేకపోతున్నానని.., రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా ఇన్ని బాధలు లేవని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ నేతల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో  జరిగిన చర్చలో గ్రూప్ రాజకీయాలు, జల్లికట్టు నిర్వాహణకు అనుమతి లభించకపోవడం తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. తనపై చాలా ఒత్తిడి ఉందన్నారు. ఎంత వినయంగా ఉన్నప్పటికీ.. గ్రూప్ రాజకీయాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. గ్రామం నుంచి కొందరిని తరిమేయాలని తనపై వస్తున్న ఒత్తిళ్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రస్తావించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, AP Politics, MLA Roja, Narayana Swamy, Rk roja, Roja Selvamani, Tdp, Ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు