హోమ్ /వార్తలు /national /

న‌వ‌ ర‌త్నాలు.. న‌వ‌ దోషాలు.. ఇదే జ‌గ‌న్ ఏడాది పాల‌న..

న‌వ‌ ర‌త్నాలు.. న‌వ‌ దోషాలు.. ఇదే జ‌గ‌న్ ఏడాది పాల‌న..

సీఎం జగన్

సీఎం జగన్

సీఎంగా జగన్ పదవి చేపట్టి నేటికి ఏడాది అవుతోంది. ఆరు నెల‌ల్లోనే మంచి సీఎం అనిపించుకుంటానని ఆ రోజే ప్రమాణం చేసిన జ‌గ‌న్ మ‌రి ఆ దిశ‌గా అడుగులు వేశారా? ఏడాది పాల‌న‌లో ఏం సాధించారు? అని.. వైసీపీ ప్రభుత్వ విజ‌యాలు, అపజయాలను ఓ సారి చూద్దాం..

ఇంకా చదవండి ...

- బాలకృష్ణ.ఎమ్, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18

అది మే 30 2019.. చుట్టూ ఆశేష జ‌నం.. కార్యక్తలు, అభిమానుల నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం.. అదో పెద్ద వేడుక.. ఆ వేడుక‌ను చూడ్డానికి ఏపీ, తెలంగాణ ప్రజలు టీవీల‌కు అతుక్కుపోయారు.. అందరిలో తెలియ‌ని ఉద్వేగం.. ఉత్సాహాం.. ఆనందం.. అప్పుడే కాన్వాయ్ దిగారు జగన్. వేదిక వద్దకు వెళ్తుంటే తొమ్మిదేళ్ల కలను తన కుమారుడు నెరవేర్చుకుంటున్నాడని విజయమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను..’ అంటూ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. నేటికి సరిగ్గా ఏడాది అయ్యింది సీఎం జగన్ పాలనకు. అయితే, ఆరు నెల‌ల్లోనే మంచి సీఎం అనిపించుకుంటానని ఆ రోజే ప్రమాణం చేసిన జ‌గ‌న్ మ‌రి ఆ దిశ‌గా అడుగులు వేశారా? గత ప్రభుత్వాలకు, తన ప్రభుత్వానికి తేడా చూపించారా? ఏడాది పాల‌న‌లో ఏం సాధించారు? అని.. వైసీపీ ప్రభుత్వ విజ‌యాలు, అపజయాలను ఓ సారి చూద్దాం..

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, YS Jagan, Andhra Pradesh Chief Minister, jagan, YS Jagan swearing-in ceremony, YS Jagan pramana sweekaram, YSRCP, YS Jagan Mohan Reddy, YSR Congress Party, Jagan Mohan reddy Oath Ceremony,ysrcp navaratnalu, ycp navaratnalu, ​YSR Congress Party President, Jagan Ane Nenu, జగన్ అనే నేను, జగన్ ప్రమాణస్వీకారం, జగన్ నవరత్నాలు, వైసీపీ నవ రత్నాలు,
సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం (ఫైల్)

జగన్ ఏడాది పాలనలో కీలకమైనది ఉద్యోగాల భర్తీ. ప్రతి గ్రామంలో గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు భారీ స్థాయిలో భర్తీ చేశారు. ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ క‌రోనా స‌మ‌యంలో చాలా ఉప‌యోగ‌ప‌డింది. ఇదే మోడ‌ల్‌ను కేర‌ళ‌, మ‌రియు క‌ర్ణాట‌క కూడా అవలంభించాయి. ఇక, 3.5 కోట్ల మందికి 40 వేల కోట్ల రూపాయలకుపైగా సాయం అందజేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఏడాది సమీక్షలో స్వయంగా ప్రకటించారు. అయితే, సీఎంగా ఓటు బ్యాంకుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శను జగన్ ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా న‌వ‌ర‌త్నాల పేరుతో భారీ స్థాయిలో డబ్బులు పంచిపెట్టార‌ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు.. ఆదాయాన్ని స‌మ‌కూర్చే మార్గాలను అన్వేషించడంలోనూ సీఎం జగన్ ఇంకా అడుగులు వేయనే లేదనే విమర్శ ఉంది.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్

పాలనలోనూ జగన్ కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ అనుభవలేమిని బయటపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంట‌నే అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రమ‌ణ్యంను తొలిగించ‌డంతో వివాధాల‌కు తెర‌లేపిన జ‌గ‌న్.. తాజాగా డాక్టర్ సుధాకర్ అంశం వరకు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు, రాజధాని మార్పు, ప్రజా వేదిక కూల్చివేతను కక్ష సాధింపు చర్యలుగా వర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఇక ఇసుక సరఫరాలోనూ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు మేఘా ఇంజనీరింగ్ పై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక అదే సంస్థకు పోలవరం ప్రాజెక్టును అప్పజెప్పడం దుమారం రేపింది.

మండలిపై జగన్ పంతం... నెరవేరాలంటే ఒకే ఒక్క ఆప్షన్... | Cm ys jagan to try hard at centre to terminate ap legislative council ak
వైఎస్ జగన్ (File)

ఇదిలా ఉండగా, 25 మంది ఎంపీల‌ను ఇవ్వండి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చిపెడతానన్న జగన్.. ఇప్పుడు పోరాటంలో వెనుకపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు క‌డ‌ప స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేసిన జ‌గ‌న్.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. టీటీడీ బోర్డులోకి శేఖర్ రెడ్డిని తీసుకుంటే అభ్యంతరం చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఆయన్ను బోర్డులోకి తీసుకోవడం తీవ్ర దుమారం లేపింది.

అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు ఆయన దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని వార్తలు వస్తున్నాయి. వైఎస్‌‌ఆర్ ఉన్నపుడు కింది స్థాయి నేత‌ల దగ్గరి నుంచి ఎంపీల వరకు అందర్నీ కలిసేవారని, జగన్ మాత్రం అలా చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Ycp

ఉత్తమ కథలు