హోమ్ /వార్తలు /national /

YS Jagan: వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్.. ఆ ఇద్దరి విషయంలో..

YS Jagan: వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్.. ఆ ఇద్దరి విషయంలో..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

AP News: ఏపీ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు, పొరుగు రాష్ట్రాలతో వ్యవహరించే తీరు విషయంలో సీఎం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

  రాజకీయాల్లో నేతలు చేసే వ్యాఖ్యలు, వేసే అడుగులు వ్యూహాత్మకంగా ఉండాలి. అందులోనూ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఓ అధికార పార్టీకి అధినేతగా ఉండే నాయకులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ విషయంలో ఇదే రకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ పూర్తిగా పైచేయి సాధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవడం ఎలా అనే అంశంపై ఆయన ఫోకస్ చేశారు. ఆ దిశగా ఆయన అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా వైసీపీ గెలుపు సాధించేలా జగన్ జాగ్రత్తలు పాటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

  ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు, పొరుగు రాష్ట్రాలతో వ్యవహరించే తీరు విషయంలో సీఎం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కేంద్రంతో సఖ్యతను కొనసాగిస్తూనే.. బీజేపీ రంగు తనకు అంటకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

  CM KCR cm kcr , delhi, cm kcr delhi tour, telangana cm, సీఎం కేసీఆర్, సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, తెలంగాణ సీఎం , అమిత్ షా, కేంద్రహోంశాఖ సమావేశం,
  ప్రధాని మోదీతో సమావేశం అయిన సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో )

  ఇక అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంతోనూ సీఎం జగన్ సానుకూల సంబంధాలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్రం, తెలంగాణలోని అధికార పార్టీలతో పాటు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. దేశంలో మోదీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి చర్చిస్తానని.. వారితో కలిసి కేంద్రంలోని మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ కొద్దిరోజులు నుంచి చెబుతున్నారు.

  Khammam: ఖమ్మంలోని ఆ సీటు ఎవరికి ? ఇద్దరు నేతలు గట్టిగా ఫోకస్ చేశారా ? టీఆర్ఎస్‌లో చర్చ

  Telangana Politics: అదే జరిగితే.. ఆ టీఆర్ఎస్ ఎంపీకి ఎమ్మెల్యే సీటు దక్కుతుందా ?

  అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి మాత్రం కేసీఆర్‌కు సానుకూల స్పందన రావడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే సీఎం జగన్ కేసీఆర్ మోదీతో ఎలా ఉన్నా.. ఆయనతో మాత్రం సానుకూల సంబంధాలే కొనసాగుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అలా తనదైన శైలిలో ఇటు ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, PM Narendra Modi

  ఉత్తమ కథలు