ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా హుందాగా వ్యవహరించారని అన్నారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్.. ఇలా ఉంటాడని తాను అనుకోలేదంటూ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి మీద జేసీ దివాకర్ రెడ్డి గతంలో పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడును కూడా ఆయన సమక్షంలోనే బహిరంగ సభల్లో దుమ్ముదులిపేవారు. అయితే, ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు కాబట్టి తానేమీ జగన్‌కు భయపడి పొగడడం లేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీ ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరోవైపు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీడీపీలోని బలమైన నేతలను ఆపరేషన్ ఆకర్ష్‌తో కమలం గూటికి చేర్చే ప్రక్రియను ప్రారంభించినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో తనకు బీజేపీలో చేరాలంటూ ఆఫర్ వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. కానీ, తాను చేరతానని కానీ,చేరనని కానీ చెప్పలేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, JC Diwakar Reddy, Niti Aayog, Pulivendula