హోమ్ /వార్తలు /national /

KTRకు భారీ షాకిచ్చిన KCR?-ఆపరేషన్ హైద్రావతి గుట్టు రట్టు! -TRS plenary వేళ BJP ఎంపీ సంచలనం

KTRకు భారీ షాకిచ్చిన KCR?-ఆపరేషన్ హైద్రావతి గుట్టు రట్టు! -TRS plenary వేళ BJP ఎంపీ సంచలనం

టీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ అనూహ్య వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ అనూహ్య వ్యాఖ్యలు

టీఆర్ఎస్ 20ఏళ్ల సంబురాల నేపథ్యంలో సోమవారం పార్టీ ప్లీనరీ జరుపుకొంటున్నవేళ.. ప్రచార చిత్రాల్లో మంత్రి కేటీఆర్ ఫొటోలు లేవని, అంతా కేసీఆర్ ఒక్కడే అన్నట్లుగా ఉందని, దీని వెనుక పెద్ద రహస్యం ఉందని, దాని పేరే ‘ఆపరేషన్ హైద్రావతి’అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ అనూహ్య వాదనను, వీడియోను తెరపైకి తెచ్చారు..

ఇంకా చదవండి ...

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)20 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్లీనరీ (TRS plenary) జరుగుతోండగా, ఆ పార్టీకి అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించిన ప్రచార చిత్రాల్లో ఎక్కడా మంత్రి కేటీఆర్ ఫొటోలు కనబడకపోవడం, సీఎం కేసీఆర్ (CM KCR) మాత్రమే కనిపిస్తుండటం వెనుక పెద్ద కథే ఉందన్నారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ‘ఆపరేషన్ హైద్రావతి’ పేరుతో ఓ ప్రాపగండా వీడియోను పోస్ట్ చేశారు. సరిగ్గా గులాబీ పండుగ నాడే కమలం నేత ఇలాంటి వీడియోను, వాదనను తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది.

అరవింద్ అనూహ్య వీడియో

‘ఆపరేషన్ హైద్రావతి’ పేరుతో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విడుదల చేసిన వీడియోలో ప్రధానంగా టీఆర్ఎస్ ప్లీనరీలో కేటీఆర్ ఫొటోకు చోటు లేకపోవడం, సీఎం కేసీఆర్ కుటుంబంలో తగాదాలు, కేటీఆర్ తమిళనాడు పర్యటన, చంద్రబాబు, రాహుల్ గాంధీల సహకారం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితర అంశాలపై అనూహ్య వాదనలు వినిపించారు. కొన్ని మాటలు నేరుగా ఎంపీ అరవిందే చెప్పగా, మరికొన్ని మాటలను బ్యాగ్రౌడ్ వాయిస్ లో వినిపించారు. ఆ వీడియోలో ఉన్న విషయాన్ని యథాతథంగా రాస్తే..

రెండుగా చీలిన BJP.. ఆ వర్గాలివే - రాష్ట్ర DGPపైనే CM KCR నిఘా : Revanth reddy


ప్లీనరీలో కనిపించని కేటీఆర్ ఫొటో

‘టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు, ఇతర ప్రకటనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటమే తప్ప పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మంత్రి కేటీఆర్ ఫొటో మచ్చుకైనా కనపడలేదు. దీని వెనుక పెద్ద మర్మమే దాగుంది. ఆ రహస్యం పేరే ‘ఆపరేషన్ హైద్రావతి’.టీడీపీ చీఫ్ చంద్రబాబు, కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ అయిన ఎంకే స్టాలిన్ తో కలిసి చేస్తున్న ఆపరేషన్ పేరే హైద్రావతి. అందులో భాగంగా టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాడు.

Huzurabad దెబ్బ : 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ! -రహస్య భేటీపై రచ్చ రచ్చ


స్టాలిన్ భరోసాతో..

పార్టీ పుట్టి 20 ఏళ్లయిన తర్వాత టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే పేరుతో మంత్రి కేటీఆర్ తమిళనాడుకు వెళ్లి డీఎంకే పని తీరును పరిశీలిస్తామని చెప్పడం కూడా ఆపరేషన్ లో భాగమే. టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది వలసదారులే. తెలంగాణలో కాంగ్రెస్ ను, టీఆర్ఎస్ ను పోషించేది ఒకడే పెద్దమనిషి(మైహోం రామేశ్వరరావు) కాబట్టి నేతలెవరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టే కేటీఆర్ తన ఎమ్మెల్యేలను స్టాలిన్ దగ్గరకు తీసుకెళుతున్నాడు. మనందరకీ స్టాలిన్ ఉన్నాడనే భరోసా కల్పించడానికే కేటీఆర్ ఈ పని చేస్తున్నాడు. ఏపీలో నారా లోకేశ్, తెలంగాణలో కేటీఆర్ భవిష్యత్ నేతలు అయ్యేలా పథకం రచించారు.

Huzurabad : కేసీఆర్ ఓడితే ఈ అభ్యర్థే కారకుడవుతాడా? -ప్రచారం చేయకుండానే ఓట్లు -రాష్ట్రపతి రేసులోనూ..


కేసీఆర్ కు చివరి ఎన్నిక..

తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో జరిగే చివరి ఎన్నిక హుజూరాబాదే. దీని తర్వాత టీఆర్ఎస్ ను కేటీఆర్ విచ్ఛిన్నం చేయబోతున్నాడు. ఈ గూడుపుఠానికి పేరే ‘ఆపరేషన్ హైద్రావతి’. ఇప్పటికే కేటీఆర్ తానే ముఖ్యమంత్రిని అని మంత్రులు, కీలక నేతలతో ప్రచారం చేయించారు. ఆ రెండు సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్ సదరు ప్రచారాన్ని ఖండించారు. అయితే కేటీఆర్ మాత్రం గజినీ మొహ్మద్ లాగా తండ్రి కుర్చీని లాగేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా అర్థమైంది. కన్నకొడుకు కాబట్టి కేటీఆర్ ను ఏమీ అనలేకపోతున్నా.. కేసీఆర్ తన జాగ్రత్తలో తానుంటున్నాడు. అందుకే టీఆర్ఎస్ ప్లీనరీ ప్రచార పోస్టర్లలో ఎక్కడా కేటీఆర్ ఫొటో లేకుండా చూసుకున్నారు..’ అని ఎంపీ అర్వింద్ వీడియోలో పేర్కొన్నారు. ఈ తరహా ప్రచారం గతంలోనూ జరగ్గా టీఆర్ఎస్ ఘాటుగా కౌంటరిచ్చింది. అయితే ఇప్పుడు ప్లీనరీలో కేటీఆర్ ఫొటోలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీ ఈ చర్యకు దిగడం గమనార్హం.

First published:

Tags: Bjp, Dharmapuri Arvind, Kcr, KTR, Trs

ఉత్తమ కథలు