Home /News /national /

POLITICS AMID PREZ POLLS MAMATA CALLS MEET OF OPPN ON JUNE 15 REACHES OUT TO SONIA GANDHI KCR AMONG 22 LEADERS MKS

CM KCR : కేసీఆర్ జాతీయ ప్లాన్ హైజాక్? -మమతా బెనర్జీ అనూహ్య చర్య -22 మంది నేతలతో ఈనెల 15న..

మమతా బెనర్జీతో కేసీఆర్ (పాత ఫొటో)

మమతా బెనర్జీతో కేసీఆర్ (పాత ఫొటో)

తెలంగాణ సీఎం కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉండగా, సరిగ్గా ఆయన పన్నిన వ్యూహాన్నే అమలు చేస్తూ అనూహ్య చర్యకు దిగారు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వివరాలివే..

జాతీయ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందంటూ గంభీర ప్రకటన చేసిన గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR).. భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉండగా, సరిగ్గా ఆయన పన్నిన వ్యూహాన్నే అమలు చేస్తూ అనూహ్య చర్యకు దిగారు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee).

త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Elections 2022) బీజేపీకి షాకిచ్చేలా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు కేసీఆర్ విశ్వప్రయత్నం చేస్తుండగా, ఆ ఉద్దేశంతోనే కీలక సమావేశానికి దీదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, సదరు సమావేశానికి సీఎం కేసీఆర్ ను సైతం ఆమె ఆహ్వానించారు. తద్వారా ఎట్టకేలకు బీజేపీ వ్యతిరేక శక్తిగా టీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో తొలిసారి గుర్తింపు లభించగా, అదే సమావేశానికి సోనియాను సైతం దీదీ ఆహ్వానించడంతో కేసీఆర్ వెళతారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. పూర్తి వివరాలివే..

Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : కేంద్రానికి CACP సంచలన ప్రతిపాదన

కేసీఆర్ ప్లాన్ హైజాక్? : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్లు గులాబీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై కేసీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల ప్రతినిధులతో మంతనాలు జరపడం తెలిసిందే. తన సారధ్యంలోనే విపక్ష నేతల సమావేశం ఢిల్లీలోగానీ, హైదరాబాద్ లో గానీ జరుగుతుందని కేసీఆర్ గతంలో చెప్పగా, సరిగ్గా అదే అంశం అజెండాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక భేటీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె శనివారం నాడు 22మంది విపక్ష నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్ తలపెట్టిన సమావేశాన్ని మమత నిర్వహిస్తుండటంతో ఆయన ప్లాన్ ను దీదీ హైజాక్ చేశారా? అనే చర్చ జరుగుతోంది.

Petrol Diesel : పెరిగిన ఇంధన డిమాండ్.. ముడి చమురు ధరల షాక్.. పెట్రో బాదుడు తప్పదు!


మమత అనూహ్య అడుగులు : రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడుకుందాం రమ్మంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం నాడు 22 మంది నేతలకు లేఖలు రాశారు. దీదీ లేఖలు రాసిన వారిలో కొందరు సీఎంలుకాగా, మిగతా వారు ఆయా పార్టీల సారధులు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ భవన్ వేదికగా ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్ష నేతల సమావేశం జరుగుతుందని, ఈ మేరకు దీదీ 22 మంది నేతలకు లేఖలు రాశారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఓ అధికారిక ప్రకటన చేసింది. ఆ ప్రకటనతోపాటే నేతలకు దీదీ రాసిన లేఖను సైతం టీఎంసీ విడుదల చేసింది. అయితే..

Modi Govt : సరోగసీ యాడ్స్‌పై కేంద్రం నిషేధం.. పిల్లల్లో తెలివి పెరుగుతుందనే ప్రకటనలపై కూడా..


ఆ 22 మంది ఎవరంటే? : రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి షాకివ్వడమే లక్ష్యంగా, విపక్షాల ఐక్యతే ధ్యేయంగా సమావేశానికి రావాలంటూ మమతా బెనర్జీ లేఖలు రాసిన 22 మంది నేతల్లో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం (బీజేడీ చీఫ్) నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం (టీఆర్ఎస్ చీఫ్) కేసీఆర్, తమిళనాడు సీఎం (డీఎంకే చీఫ్) స్టాలిన్, మహారాష్ట్ర సీఎం (శివసేన చీఫ్) ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం (జేఎఎం చీఫ్) హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి, జేడీఎస్ నుంచి దేవేగౌడ, ఆయన కొడుకు కుమారస్వామి, ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ పవన్ చామ్లింగ్, యునైటెడ్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడు ఖదీర్ మోయినుద్దీన్ ఉన్నారు.

Civilian Killings : ఇండియన్ ఆర్మీ జవాన్లపై హత్య కేసు.. నాగాలాండ్ పోలీసుల సంచలనం.. అక్కడా ఎన్టీఏ ప్రభుత్వం..


దీదీ ఒంటెద్దు పోకడ?  : నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అంశంపై మాట్లాడుకునేందుకు జూన్ 15న సమావేశం కావాలని విపక్ష నేతలు ముందుగానే నిర్ణయించుకున్నారని, ఆ భేటీకి రాకుండా మమత విడిగా తాను అదే రోజు సమావేశానికి పిలుపునివ్వడం ఒంటెద్దు పోకడకు నిదర్శనమని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరీ మండిపడ్డారు. అయితే దీదీతో భేటీకి వెళ్లబోనని మాత్రం ఆయన అనలేదు. కాగా,

బీజేపీ వ్యతిరేకిగా టీఆర్ఎస్‌కు గుర్తింపు!: తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు ఏడాది కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి, పలు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు సైతం చేశారు. మొదట్లో బీజేపీని బంగాళాఖాతంలో కలపడమే లక్ష్యమన్న కేసీఆర్.. తర్వాతి కాలంలో జాతీయ అజెండా రూపకల్పనే ధ్యేయమని చెప్పారు. అయితే, గౌరవప్రదమైన భేటీలు తప్ప కేసీఆర్ ప్రయత్నాలకు పెద్దగా ఆదరణ లభించకపోగా, టీఆర్ఎస్ కచ్చితంగా బీజేపీ వ్యతిరేక పార్టీనే అని మిగతా పార్టీలు ఇప్పటిదాకా విశ్వసించలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు జారీ చేసిన పలు ప్రకటనల్లో కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం టీఆర్ఎస్ పోరుపై అనుమానాలు రేకెత్తించినట్లయింది. అయితే, బీజేపీయేతర పార్టీల సమావేశానికి తొలిసారి కేసీఆర్ కు మమత ఆహ్వానం పంపడం ద్వారా విపక్షాలకు టీఆర్ఎస్ అవసరం తెలిసొచ్చిందనే భావన్ వ్యక్తమవుతోంది. కానీ,

CM KCR : గజ్వేల్‌కు కేసీఆర్‌ గుడ్‌బై? -బీజేపీపై అనూహ్య వ్యూహం -కేటీఆర్‌కు జాక్‌పాట్?


సోనియా పాల్గొనే భేటీకి కేసీఆర్ వెళతారా? : బీజేపీ వ్యతిరేక శక్తిగా ఎట్టలకే టీఆర్ఎస్ కు గుర్తింపు లభించినప్పటికీ, మమతా బెనర్జీ ఆహ్వానం మేరకు ఈనెల 15న ఢిల్లీలో జరగబోయే భేటీకి కేసీఆర్ వెళతారా? లేదా? అనేది సందిగ్ధంగానే ఉంది. కాంగ్రెస్ అధినేత్రిని సైతం దీదీ ఆహ్వానించిన దరిమిలా సోనియా గాంధీ పాల్గొనే భేటీకి కేసీఆర్ హాజరు అనుమానమే. కాంగ్రెసేత, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కోరుతోన్న కేసీఆర్ కు మమత ఆహ్వానం ఒకింత ఇబ్బందికర పరిస్థితిని కలుగజేసినట్లయిందనే చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ తన బదులు ప్రతినిధిని పంపే అవకాశాలే ఎక్కువ. ఒకవేళ భేటీకి పోకుంటే కేసీఆర్ అచ్చమైన బీజేపీ వ్యతిరేకి కాదనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో గులాబీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మమత ఆహ్వానంపై కేసీఆర్ లేదా టీఆర్ఎస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Mamata Banarjee, President Elections 2022, TMC, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు