POLITICS AMARINDER SINGH LIKELY TO MERGE HIS PUNJAB LOK CONGRESS WITH BJP PVN
Amarinder Singh : సొంత పార్టీని బీజేపీలో విలీనం చేసి కాషాయ తీర్థం పుచ్చుకోనున్న కెప్టెన్!
అమరీందర్ సింగ్(ఫైల్ ఫొటో)
Amarinder Singh To Join BJP : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh) త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ (PLCP)ని కూడా అమరీందర్ బీజేపీలో విలీనం చేయనున్నట్లు సమాచారం.
Amarinder Singh To Join BJP : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh) త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ (PLCP)ని కూడా అమరీందర్ బీజేపీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. బీజేపీ(BJP)తో పంజాబ్ లోక్ కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు చివరి దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే వారం లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ అవుతుందని తెలిపాయి. అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. వెన్నుముఖ శస్త్రచికిత్స కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గత ఆదివారం అమరీందర్‌కు సర్జరీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో ఆయనతో మాట్లాడారు. అమరీందర్ సింగ్ వచ్చే వారం లండన్ నుంచి పంజాబ్ కు తిరిగి రానున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరడంతోపాటు తన పార్టీ పీఎల్సీపీని బీజేపీలో విలీనం చేయనున్నారని సమాచారం.
అయితే, కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌ను పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి ఆసక్తిగా లేదని సమాచారం. మాజీ కేంద్ర మంత్రి,పాటియాలా కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్ తన కుమార్తె జై ఇందర్ కౌర్‌కు పాటియాలా లోక్‌సభ టిక్కెట్టు హామీ ఇవ్వాలని బీజేపీని కోరుతున్నట్లు సమాచారం. అయితే తన భర్త అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కూడా ప్రణీత్ కౌర్ కాంగ్రెస్‌ను వీడకపోవడం పట్ల బీజేపీ నాయకత్వం సంతోషంగా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా,0 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి మూడు సార్లు సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ ను గత ఏడాది సీఎం పదవి నుంచి కాంగ్రెస్ మార్చింది. సీఎం పదవి నుండి వైదొలిగిన తర్వాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు తల్లెత్తాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్ ఘోరంగా ఓడిపోయారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.